Breaking News

టీ20 ప్రపంచకప్ కోసం యూఎస్‌ఏ జట్టు ప్రకటన

Published on Fri, 01/30/2026 - 18:13

భారత్‌, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్‌ 2026 కోసం 15 మంది సభ్యుల యూఎస్‌ఏ జట్టును ఇవాళ (జనవరి 30) ప్రకటించారు. ఈ జట్టుకు సారధిగా మోనాంక్‌ పటేల్‌ ఎంపికయ్యాడు. గత ఎడిషన్‌లో (2024) ఆడిన 10 మంది ఆటగాళ్లు, ఈసారి కూడా చోటు దక్కించుకున్నారు. కొత్తగా శుభమ్ రంజనే, మహ్మద్ మొహ్సిన్, షేహాన్ జయసూర్య ప్రపంచకప్‌ జట్టులోకి వచ్చారు.

యూఎస్‌ఏకు ఇది రెండో టీ20 ప్రపంచకప్‌. గత ఎడిషన్‌లో ఈ జట్టు పాకిస్తాన్‌ను చిత్తు చేసి సంచలనం సృష్టించింది. ఆ మ్యాచ్‌లో సూపర్‌ ఓవర్‌లో విజయం సాధించి, సూపర్‌-8కు కూడా అర్హత సాధించింది. ఈసారి కూడా యూఎస్‌ఏ సంచలనాలు సృష్టించే అవకాశం ఉంది. ఆ జట్టు బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాల్లో బలంగా ఉంది. ఆండ్రీస్‌ గౌస్‌, మోనాంక్‌ పటేల్‌ ఆ జట్టు ప్రధాన బ్యాటర్లుగా ఉన్నారు. బౌలింగ్‌లో నేత్రవల్కర్‌, నోస్తుష్ కెన్జిగే, అలీ ఖాన్ కీలకమయ్యే అవకాశం ఉంది.

గ్రూప్‌-ఏలో భారత్‌, పాకిస్తాన్‌ లాంటి జట్లతో పోటీపడాల్సి ఉన్న యూఎస్‌ఏ.. ఇదే గ్రూప్‌లోని నమీబియా, నెదర్లాండ్స్‌పై సంచలన విజయాలు సాధించే ఆస్కారం ఉంది. ఫిబ్రవరి 7న టీమిండియా మ్యాచ్‌తో యూఎస్‌ఏ తమ రెండో ప్రపంచకప్‌ ప్రయాణాన్ని ప్రారంభించనుంది.

టీ20 ప్రపంచకప్‌ 2026 కోసం యూఎస్‌ఏ జట్టు..  
మోనాంక్ పటేల్ (కెప్టెన్), జెస్సీ సింగ్, ఆండ్రీస్ గౌస్, షేహాన్ జయసూర్య, మిలింద్ కుమార్, షయాన్ జహంగీర్, సాయితేజ ముక్కమల, సంజయ్ కృష్ణమూర్తి, హర్మీత్ సింగ్, నోస్తుష్ కెన్జిగే, షాడ్లీ వాన్ స్కాల్క్విక్, సౌరభ్ నేత్రవల్కర్, అలీ ఖాన్, మహ్మద్ మొహ్సిన్, శుభమ్ రంజనే.  

గ్రూప్-ఏలో యూఎస్‌ఏ మ్యాచ్‌లు  
- ఫిబ్రవరి 7: ఇండియా vs USA (ముంబై)  
- ఫిబ్రవరి 10: పాకిస్తాన్ vs USA (కొలంబో)  
- ఫిబ్రవరి 13: నెదర్లాండ్స్ vs USA (చెన్నై)  
- ఫిబ్రవరి 15: నమీబియా vs USA (చెన్నై)  

 

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)