కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డిపై టీడీపీ సీరియస్ నేతల ఫైర్
Breaking News
రొనాల్డో కోసం ఏదైనా.. టాప్‌లెస్‌గా దర్శనం
Published on Mon, 12/05/2022 - 21:54
అమెరికాకు చెందిన మాజీ గోల్ఫ్ క్రీడాకారిణి పెయిజ్ స్పిరానక్ పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డోకు వీరాభిమాని. ముఖ్యంగా రొనాల్డో సుయ్ (Sui Celebration)కు పెద్ద ఫ్యాన్. తాజాగా ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో పాల్గొంటున్న రొనాల్డో తన జట్టు పోర్చుగల్‌ను విజేతగా నిలిపే పనిలో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే రౌండ్ ఆఫ్ 16కు అర్హత సాధించిన పోర్చుగల్ డిసెంబర్ 7న స్విట్జర్లాండ్‌తో తలపడనుంది.
ఇదిలా ఉంటే రొనాల్డో సుయ్ సెలబ్రేషన్ ఎంత పాపులర్ అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అతని సెలబ్రేషన్‌ను ఇప్పటికే చాలా మంది అనుసరించారు. క్రికెటర్లు కూడా ఈ జాబితాలో ఉన్నారు. అయితే రొనాల్డోకు వీరాభిమాని అయిన పెయిజ్ స్పిరానక్ మాత్రం కాస్త వినూత్నంగా సెలబ్రేట్ చేసుకుంది. బంతిని గోల్‌పోస్ట్‌లోకి తరలించాకా.. తాను వేసుకున్న టాప్‌ను తొలగించి సుయ్ సెలబ్రేషన్ చేసుకుంది. ఆ తర్వాత ఇన్నర్ వేర్‌పై మోకాళ్లపై కూర్చొని లవ్ యూ రొనాల్డో అంటూ నవ్వులు చిందించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
.@PaigeSpiranac here to give us her best Brandi Chastain celebration
— PointsBet Sportsbook (@PointsBetUSA) November 30, 2022
How’d she do? pic.twitter.com/TWRbdtZ9VM
చదవండి: FIFA: మ్యాచ్ సమయంలో మెస్సీ ఎందుకు నడుస్తాడో తెలుసా?
FIFA WC: మహా తుంటరోడు.. తండ్రి లక్షణాలు ఒక్కటీ రాలేదు!
Tags : 1