Breaking News

సంజయ్, మోనాంక్‌ మెరుపులు

Published on Mon, 02/16/2026 - 08:11

చెన్నై: భారత సంతతి ఆటగాళ్లు సంజయ్‌ కృష్ణ మూర్తి (33 బంతుల్లో 68; 4 ఫోర్లు, 6 సిక్స్‌లు), కెపె్టన్‌ మోనాంక్‌ పటేల్‌ (30 బంతుల్లో 52; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) ధనాధన్‌ షోతో అదరగొట్టారు. ఫలితంగా టి20 ప్రపంచకప్‌లో అమెరికా జట్టు రెండో విజయం అందుకుంది. గ్రూప్‌ ‘ఎ’లో ఆదివారం జరిగిన తమ చివరి లీగ్‌ మ్యాచ్‌లో అమెరికా 31 పరుగుల తేడాతో నమీబియాపై గెలిచింది. 

టాస్‌ నెగ్గి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన అమెరికా నిరీ్ణత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 199 పరుగుల భారీ స్కోరు చేసింది. మోనంక్,  జహంగీర్‌ (22) ఓపెనింగ్‌ వికెట్‌కు 68 పరుగులు జోడించి మెరుపు ఆరంభమిచ్చారు. తర్వాత సంజయ్, మిలింద్‌ కుమార్‌ (28; 1 ఫోర్, 1 సిక్స్‌) నాలుగో వికెట్‌కు 87 పరుగులు జతచేశారు. ఈ రెండు భాగస్వామ్యాలు అమెరికా భారీస్కోరుకు బాట వేశాయి. నమీబియా బౌలర్లపై ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ సంజయ్‌ భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. 

నమీబియా బౌలర్లలో విలెమ్, ఎరాస్మస్‌ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం కొండంత లక్ష్యాన్ని ఛేదించేందుకు దిగిన నమీబియా 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 168 పరుగులు చేసి ఓడింది. లారెన్‌ స్టీన్‌కాంప్‌ (39 బంతుల్లో 58; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించాడు. స్మిత్‌ (31; 1ఫోర్, 1 సిక్స్‌) మెరుగ్గా ఆడాడు. షాడ్లే వాన్‌కు 2 వికెట్లు దక్కాయి. నిరీ్ణత నాలుగు మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న అమెరికా రెండు విజయాలు, రెండు పరాజయాలతో నాలుగు పాయింట్లు సాధించి గ్రూప్‌ ‘ఎ’లో రెండో స్థానానికి చేరింది.  

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)