Breaking News

టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే..?

Published on Sun, 10/20/2024 - 13:56

బెంగళూరు వేదికగా న్యూజిలాండ్‌ జరిగిన తొలి టెస్టులో భారత్‌కు ఊహించని పరాభావం ఎదురైంది. టెస్టుల్లో వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియా దూకుడుకు కివీస్ బ్రేక్‌లు వేసింది. మొదటి టెస్టులో న్యూజిలాండ్ చేతిలో 8 వికెట్ల తేడాతో భారత్ ఓటమి పాలైంది. 107 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కివీస్ కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. 

ఇక బెంగళూరు టెస్టు అనంతరం ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ 2023-25 సీజన్‌ పాయింట్ల పట్టికలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. అయితే ఈ ఓటమితో పాయింట్ల టేబుల్‌లో టీమిండియా  స్థానం విషయంలో మాత్రం ఎలాంటి మార్పులేదు. భార‌త్ 98 పాయింట్ల‌తో అగ్ర‌స్ధానంలో కొన‌సాగుతోంది. కానీ ఈ ఓట‌మితో భార‌త్ పర్సంటేజీలో తగ్గుదల కనిపించింది.

పర్సంటేజీలో 74.24 శాతం నుంచి 68.06 శాతానికి పడిపోయింది. మ‌రోవైపు ఈ చారిత్ర‌త్మ‌క విజ‌యంతో న్యూజిలాండ్ పాయింట్ల ప‌ట్టిక‌లో ఆరో స్థానం నుంచి నాలుగో ప్లేస్‌కు చేరుకుంది. ఈ క్ర‌మంలో 44.40 విజయ శాతంతో ఇంగ్లండ్‌(43.06)ను కివీస్ వెన‌క్కి నెట్టింది. అయితే పాయింట్ల ప‌రంగా కివీస్‌(48) కంటే ఇంగ్లండ్(93) మెరుగ్గానే ఉంది. ఇక పాయింట్ల ప‌ట్టిక‌లో భార‌త్ త‌ర్వాత స్ధానాల్లో ఆస్ట్రేలియా (62.50), శ్రీలంక (55.56) ఉన్నాయి.

భార‌త్ ఫైన‌ల్ చేరాలంటే?
డ‌బ్ల్యూటీసీ 2023-25 ఫైన‌ల్‌కు టీమిండియా చేరాలంటే పాయింట్ల ప‌ట్టిక‌లో తొలి రెండు స్ధానాల్లో నిలిస్తే చాలు. ఈ ఓట‌మి భార‌త్‌పై పెద్ద‌గా ప్ర‌భావం చూప‌కపోవ‌చ్చు. ఎందుకంటే ప్ర‌స్తుత సైకిల్‌లో టీమిండియా ఇంకా ఏడు మ్యాచ్‌లు ఆడ‌నుంది. 

అందులో క‌నీసం మూడు విజ‌యాలు సాధిస్తే చాలు భార‌త్ ఫైన‌ల్‌కు ఆర్హ‌త సాధిస్తుంది. అయితే ఈ సిరీస్ త‌ర్వాత భార‌త్‌ బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో త‌ల‌ప‌డేందుకు ఆస్ట్రేలియాకు వెళ్ల‌నుంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో కంగారుల‌తో రోహిత్ సేన త‌ల‌ప‌డ‌నుంది. 

అయితే ఆసీస్ గ‌డ్డ‌పై క‌మ్మిన్స్ సేన‌ను ఓడించ‌డం అంత ఈజీ కాదు. కాబ‌ట్టి కివీస్‌తో జరగబోయే రెండు టెస్టులు కూడా భార‌త్‌కు కీల‌కమ‌ని చెప్పుకోవాలి. న్యూజిలాండ్‌-భార‌త్ మ‌ధ్య రెండో టెస్టు పుణే వేదిక‌గా అక్టోబ‌ర్ 24 నుంచి ప్రారంభం కానుంది.
చదవండి: జస్ప్రీత్ బుమ్రా కంటే అతడు ఎంతో బెటర్‌: పాక్‌ ప్లేయర్‌
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)