టీమిండియా స్టార్‌ క్రికెటర్‌కు అండర్‌ వరల్డ్‌ బెదిరింపులు

Published on Thu, 10/09/2025 - 13:52

టీమిండియా యువ క్రికెటర్‌, పొట్టి క్రికెట్‌లో మ్యాచ్‌ ఫినిషర్‌గా పేరు తెచ్చుకున్న రింకూ సింగ్‌కు (Rinku Singh) అండర్‌ వరల్డ్‌ (Under World) నుంచి బెదిరింపులు వచ్చాయి. ఈ విషయాన్ని ముంబై క్రైం బ్రాంచ్‌ పోలీసులు వెల్లడించినట్లు ఓ ప్రముఖ వార్త సంస్థ పేర్కొంది.

వారి సమాచారం మేరకు.. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ మధ్యలో రింకూకు దావూద్‌ గ్యాంగ్‌ (Dawood Gang) నుంచి మూడు బెదిరింపు కాల్స్‌ వచ్చాయి. గ్యాంగ్‌ సభ్యులు రింకూ ప్రమోషన్‌ టీమ్‌ను రూ. 5 కోట్లు డిమాండ్‌ చేశారు.

ఈ కేసుకు సంబంధించి మొహమ్మద్‌ దిల్షద్‌, మొహమ్మద్‌ నవీద్‌ అనే ఇద్దరిని పోలీసుల అదుపులో ఉన్నారు. వీరిని ఓ కరీబియన్‌ దీవి  పోలీసులు అరెస్ట్‌ చేసి, ఆగస్ట్‌ 1న ముంబై క్రైం బ్రాంచ్‌ పోలీసులకు అప్పగించారు. పోలీసుల విచారణలో వారు రింకూ సింగ్‌ను బెదిరించినట్లు ఒప్పుకున్నారు.

ఇక్కడ మరో విశేషమేమిటంటే.. రింకూ కేసుకు సంబంధించి పోలీసుల అదుపులో ఉన్న ఇద్దరు, ఇటీవల ముంబైలో హత్య చేయబడ్డ ఎన్‌సీపీ నేత బాబా సిద్దికీ కుమారుడు జీషన్‌ సిద్దికీని రూ. 10 కోట్ల రూపాయల కోసం బెదిరించిన కేసులో నిందితులు.

మరోసారి మ్యాచ్‌ ఫినిషర్‌గా..!
రింకూ సింగ్‌ మరోసారి మ్యాచ్‌ ఫినిషర్‌ పాత్రకు న్యాయం చేశాడు. తాజాగా పాకిస్తాన్‌తో జరిగిన ఆసియా కప్‌ ఫైనల్లో బౌండరీ బాది మ్యాచ్‌ను ముగించాడు. ఈ టోర్నీలో రింకూ ఆడిన ఏకైక మ్యాచ్‌ ఇదే. రింకూ బౌండరీతో భారత్‌ ఆసియా కప్‌లో విజేతగా నిలిచింది. 

చదవండి: టీమిండియాకు షాక్‌ ఇవ్వనున్న మ్యాక్స్‌వెల్‌..!

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)