Breaking News

యువ భారత్‌ సంచలన విజయం.. వరల్డ్‌కప్‌ ఫైనల్లోకి ప్రవేశం

Published on Tue, 02/06/2024 - 21:29

సౌతాఫ్రికా వేదికగా జరుగుతున్న అండర్‌-19 వరల్డ్‌కప్‌లో యువ భారత్‌ జట్టు ఫైనల్లోకి ప్రవేశించింది. సౌతాఫ్రికాతో ఇవాళ (ఫిబ్రవరి 6) జరిగిన తొలి సెమీఫైనల్లో ఉదయ్‌ సహారన్‌ సేన సంచలన విజయం సాధించి, ఆతిథ్య జట్టుకు గుండెకోతను మిగిల్చింది. 245 పరుగుల లక్ష్య ఛేదనలో 32 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన భారత్‌ను సచిన్‌ దాస్‌ (95), కెప్టెన్‌ ఉదయ్‌ సహారన్‌ (81) చిరస్మరణీయ ఇన్నింగ్స్‌లు ఆడి గెలిపించారు. వీరు ఐదో వికెట్‌కు 171 పరుగులు జోడించి సౌతాఫ్రికా చేతల నుంచి మ్యాచ్‌ను లాగేసుకున్నారు. 

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన సౌతాఫ్రికా.. లుహాన్‌ డ్రి ప్రిటోరియస్‌ (76), రిచర్డ్‌ సెలెట్‌స్వేన్‌ (64) అర్ధసెంచరీలతో రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 244 పరుగులు చేసింది. ఆఖర్లో ట్రిస్టన్‌ లూస్‌ (23 నాటౌట్‌) మెరుపు ఇన్నింగ్స్‌తో విరుచుకుపడగా.. కెప్టెన్‌ జుయాన్‌ జేమ్స్‌  (24) ఓ మోస్తరు ఇన్నింగ్స్‌ ఆడాడు. భారత బౌలరల్లో రాజ్‌ లింబాని 3, ముషీర్‌ ఖాన్‌ 2, నమన్‌ తివారి, సౌమీ పాండే తలో వికెట్‌ పడగొట్టారు.

245 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్‌కు తొలి బంతికే షాక్‌ తగిలింది. సౌతాఫ్రికా సంచలన పేసర్‌ మపాకా ఆదర్శ్‌ సింగ్‌ను తొలి బంతికే ఔట్‌ చేశాడు. ఆతర్వాత నాలుగో ఓవర్‌లో టీమిండియాకు అతి భారీ షాక్‌ తగిలింది. భీకర ఫామ్‌లో ఉన్న ముషీర్‌ ఖాన్‌ను (4) ట్రిస్టన్‌ లూస్‌ పెవిలియన్‌కు పంపాడు. ఆతర్వాత భారత్‌ 10, 12 ఓవర్లలో అర్షిన్‌ కులకర్ణి (12), ప్రియాన్షు మోలియా (5) వికెట్లు కోల్పోయింది. ట్రిస్టన్‌ లూసే వీరిద్దరి వికెట్లు పడగొట్టాడు. ఈ దశలో జతకట్టిన ఉదయ్‌ సహారన్‌, సచిన్‌ దాస్‌ జోడీ సౌతాఫ్రికా బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొని వారి నుంచి మ్యాచ్‌ లాగేసుకుంది. 

చివర్లో భారత్‌ వరుసగా వికెట్లు కోల్పోయి కాస్త ఒత్తిడికి లోనైనప్పటికీ.. రాజ్‌ లింబానీ (13 నాటౌట్‌) బౌండరీ బాది టీమిండియాకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. 48.5 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించిన భారత్‌ 2 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, ఫైనల్లోకి ప్రవేశించింది. ఫిబ్రవరి 8న జరిగే రెండో సెమీఫైనల్లో ఆస్ట్రేలియా-పాకిస్తాన్‌ జట్లు తలపడనున్నాయి.


  

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)