Breaking News

World Cup Final: తెలుగులో మాట్లాడుకున్న క్రికెటర్లు.. వైరల్‌ వీడియో

Published on Sun, 02/11/2024 - 20:34

భారత్‌-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న అండర్‌ 19 వరల్డ్‌కప్‌ 2024 ఫైనల్లో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. టీమిండియాకు ప్రాతినిథ్యం వహిస్తున్న తెలంగాణ ప్రాంత ఆటగాళ్లు అవనీశ్‌ రావు, అభిషేక్‌ మురుగన్‌ తెలుగులో మాట్లాడుకున్నారు. ఆస్ట్రేలియా బ్యాటింగ్‌ సమయంలో వికెట్‌కీపర్‌ అవనీశ్‌ రావు, స్పిన్‌ బౌలర్‌ అభిషేక్‌ మురుగన్‌తో హైదరాబాద్‌ యాసలో సంభాషించాడు.

దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది. విదేశీ గడ్డపై వరల్డ్‌కప్‌ లాంటి మెగా ఈవెంట్‌ ఫైనల్లో ఇద్దరు తెలుగు వాళ్లు మాట్లాడుకుంటుంటే వినసొంపుగా ఉందంటూ నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. 

ఇదిలా ఉంటే, వరల్డ్‌కప్‌ ఫైనల్లో టీమిండియా ఓటమి దిశగా పయనిస్తుంది. ఆసీస్‌ నిర్ధేశించిన 254 పరుగుల లక్ష్య ఛేదనలో యువ భారత్‌ చేతులెత్తేసింది. 36 ఓవర్ల తర్వాత భారత్‌ స్కోర్‌ 136/8గా ఉంది. ఈ మ్యాచ్‌లో భారత్‌ గెలవాలంటే ఇంకా 118 పరుగులు చేయాలి చేతిలో కేవలం మూడు వికెట్లు మాత్రమే ఉన్నాయి. ఏదైన మహాద్బుతం జరిగితే తప్ప ఈ మ్యాచ్‌లో టీమిండియా గట్టెక్కలేదు.

మురుగన్‌ అభిషేక్‌ (23), నమన్‌ తివారి (2) క్రీజ్‌లో ఉన్నారు. భారత స్టార్‌ త్రయం ముషీర్‌ ఖాన్‌ (22), ఉదయ్‌ సహారన్‌ (8), సచిన్‌ దాస్‌ (9) డు ఆర్‌ డై మ్యాచ్‌లో చేతులెత్తేశారు. ఓపెనర్‌ ఆదర్శ్‌ సింగ్‌ (47) కొద్దో గొప్పో ఆడేందుకు ప్రయత్నించాడు. ఆర్శిన్‌ కులకర్ణి 3, ప్రియాన్షు మోలియా 9, అవనీశ్‌ 0, రాజ్‌ లింబాని 0 పరుగులకు ఔటయ్యారు. 

అంతకుముందు టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసింది. ఆసీస్‌ ఇన్నింగ్స్‌లో హర్జస్‌ సింగ్‌ (55) అర్దసెంచరీతో రాణించగా.. హ్యారీ​ డిక్సన్‌ (42), హగ్‌ వెబ్జెన్‌ (48), ఒలివర్‌ పీక్‌ (46 నాటౌట్‌) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. భారత బౌలర్లలో రాజ్‌ లింబాని 3, నమన్‌ తివారి 2, సౌమీ పాండే, ముషీర్‌ ఖాన్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

Videos

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)