Breaking News

కొరియాను చిత్తు చేసిన భారత్‌.. ఆరోసారి ఫైనల్లో

Published on Mon, 09/16/2024 - 17:21

ఆసియా పురుషుల చాంపియన్స్‌ ట్రోఫీ హాకీ టోర్నీలో భారత జట్టు మరోసారి దుమ్ములేపింది. ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్లో ఏకంగా ఆరోసారి ఫైనల్‌కు చేరుకుంది. చైనా వేదికగా సోమవారం జరిగిన సెమీస్‌ మ్యాచ్‌లో సౌత్‌ కొరియాను 4-1తో చిత్తు చేసింది. ఆద్యంతం ప్రత్యర్థిపై పైచేయి సాధిస్తూ.. గెలుపు జెండా ఎగురవేసింది. 

భారత ఆటగాళ్లలో ఉత్తమ్‌ సింగ్‌, జర్మన్‌ప్రీత్‌ సింగ్‌ చెరొక గోల్‌ చేయగా.. కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ రెండు గోల్స్‌తో మెరిశాడు. ఆట తొలి క్వార్టర్‌ చివరలో ఉత్తమ్‌ భారత్‌కు తొలి గోల్‌ అందించగా.. హర్మన్‌ప్రీత్‌ రెండో క్వార్టర్‌ ఆరో నిమిషంలో పెనాల్టీ కార్నర్‌ కిక్‌ను గోల్‌గా మలిచాడు. 

కొరియా ఒక గోల్‌ కొట్టింది
ఆ తర్వాత జర్మన్‌ గోల్‌ సాధించగా.. మూడో క్వార్టర్‌లో హర్మన్‌ మరోసారి గోల్‌తో అదరగొట్టాడు. ఈ మూడూ కూడా ఫీల్డ్‌ గోల్సే(ప్రత్యర్థి గోల్‌పోస్టు ముందున్న స్ట్రైకింగ్‌ సర్కిల్‌ నుంచి) కావడం విశేషం. అయితే, మూడో క్వార్టర్‌లోనే కొరియా కూడా గోల్‌ కొట్టి పుంజుకునేందుకు ప్రయత్నించింది. అయితే, భారత డిఫెన్స్‌ వారిని కట్టడిచేయడంతో పరాజయం తప్పలేదు. 

భారత్‌ అజేయంగా ఫైనల్‌కు
కాగా ఈ ఆసియా చాంపియన్స్‌ తాజా ఎడిషన్‌లో భారత్‌ ఇంత వరకు ఒక్క మ్యాచ్‌లోనూ ఓడిపోలేదు. ఇక లీగ్‌ దశలో చైనాను 3-0తో, జపాన్‌ను 5-1తో, మలేషియాను 8-1తో, పాకిస్తాన్‌ను 2-1తో ఓడించింది. సెమీ ఫైనల్లో కొరియాను 4-1తో ఓడించి ఫైనల్లో అడుగుపెట్టింది. టైటిల్‌ పోరులో ఆతిథ్య చైనాతో తలపడనుంది.

చదవండి: పాకిస్తాన్‌కు షాకిచ్చిన చైనా.. తొలిసారి ఫైనల్‌కు

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)