Breaking News

టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్‌..! 'ఐరెన్ లెగ్‌' అంపైర్‌ వచ్చేశాడు

Published on Thu, 11/21/2024 - 15:56

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25కు స‌ర్వం సిద్ద‌మైంది. మరి కొన్ని గంట‌ల్లో ఈ ప్ర‌తిష్టాత్మ‌క సిరీస్‌కు తెర లేవ‌నుంది. ఈ సిరీస్‌లో భాగంగా భార‌త్‌-ఆస్ట్రేలియా మ‌ధ్య‌ తొలి టెస్టు న‌వంబర్ 22 నుంచి పెర్త్ వేదిక‌గా ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను శుభారంభం చేయాల‌ని ఇరు జ‌ట్లు భావిస్తున్నాయి.

అందుకు తగ్గ‌ట్టే ఇరు జట్లు నెట్స్‌లో తీవ్రంగా శ్ర‌మించాయి. ఇక పెర్త్ వేదిక‌గా జ‌రిగే ఈ తొలి టెస్టుకు అంపైర్‌ల‌ను ఐసీసీ ప్ర‌క‌టించింది. రిచర్డ్ కెటిల్‌బరో, క్రిస్ గాఫ్నీలు ఆన్-ఫీల్డ్ అంపైర్లుగా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. అదేవిధంగా రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్ థ‌ర్డ్ అంపైర్‌గా, సామ్ నోగాజ్‌స్కీ నాలుగో అంపైర్‌గా, రంజన్ మదుగల్లె మ్యాచ్ రిఫరీగా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించ‌నున్నారు.

అయితే ఈ జాబితాలో రిచర్డ్ కెటిల్‌బరో ఉండ‌డంతో భార‌త అభిమానులు తెగ టెన్ష‌న్ ప‌డుతున్నారు. గతంలో భారత్ ఓడిపోయిన ప్రతీ కీలక మ్యాచ్‌లోనూ రిచర్డ్ కెటిల్‌బరోనే అంపైర్ కావడం గమనార్హం. ముఖ్యంగా అత‌డు అంపైర్‌గా ఉన్న ఒక్క ఐసీసీ నాకౌట్ మ్యాచ్‌లోనూ భార‌త్ విజ‌యం సాధించలేదు. దీంతో ఫ్యాన్స్ అత‌డిని ఐరెన్ లెగ్ అంపైర్‌గా పిలుస్తుంటారు. ఈసారి మరి ఫలితం ఏవిధంగా ఉంటుందో ఎదురు చూడాలి.
చదవండి: ఇదంతా విరాట్ భాయ్ వల్లే.. అతడే నాకు ఆదర్శం: యశస్వీ జైశ్వాల్‌

Videos

ఆసియా కప్‌లో దాయాదుల పోరు, భారత్ Vs పాక్ మ్యాచ్.. ఎలా చూడాలంటే..?

సోషల్ మీడియా అకౌంట్లు తొలగింపు బాబు, లోకేష్ పై జగన్ ఫైర్

అమ్మాయి దొరకకపోతే బోనులో నుంచుంటావ్.. DGPకి జస్టిస్ బట్టు దేవానంద్ వార్నింగ్...

స్థానిక ఎన్నికల సమరం.. జేసీకి పెద్దారెడ్డి ఛాలెంజ్

DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త

బస్సు ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు!

నేపాల్ సహాయక చర్యల్లో మరో మిరాకిల్

దివ్యతేజ మృతిపై అనుమానాలు,స్టేషన్ కు వెళ్లి.. శవమై వచ్చాడా..?

డీఎస్సీ ఉద్యోగాలపై బొత్స బాంబు.. 14-15 లక్షలకు పోస్టులు అమ్ముకున్నారు..!

మీ పాదయాత్రలో పాల్గొంటే DSC ఉద్యోగాలు పంచేస్తారా?

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు