25 పరుగులకే ఆలౌట్‌.. 5 బంతుల్లో మ్యాచ్‌ ఫినిష్‌

Published on Fri, 06/05/2026 - 10:54

ఏసీసీ ఉమెన్స్ టీ20 ప్రీమియ‌ర్ క‌ప్ 2026లో యూఏఈ- సౌదీ అరేబియా మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్‌ ఓ సంచ‌ల‌న రికార్డుకు వేదికైంది. ప్ర‌త్య‌ర్ధి నిర్ధేశించిన ల‌క్ష్యాన్ని యూఏఈ మ‌హిళ‌ల జ‌ట్టు కేవ‌లం 5 బంతుల్లోనే ఛేదించి క్రికెట్ ప్ర‌పంచాన్ని ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ఈ టోర్నీలో భాగంగా బుధ‌వారం భాంగ్ వేదిక‌గా యూఏఈ, సౌదీ అరేబియా జ‌ట్లు త‌ల‌ప‌డ్డాయి. 

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌదీ జ‌ట్టు యూఏఈ బౌలర్ల ధాటికి 15.3 ఓవర్లలో కేవలం 25 పరుగులకే కుప్ప‌కూలింది. . ఆ జట్టులో ఏ ఒక్క బ్యాటర్ కూడా రెండంకెల స్కోరును అందుకోలేక‌పోయారు. ప్టెన్ మషాయెల్ వకాస్ చేసిన 9 పరుగులే జట్టులో అత్యధిక స్కోరు కావ‌డం గ‌మ‌నార్హం. 

సురక్షా కొట్టే, హీనా హోట్‌చందాని, ఈషా ఓజా తలా 3 వికెట్లు పడగొట్టి సౌధీ పతనాన్ని శాసించారు. అనంతరం 26 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన యూఏఈ.. ఐదు బంతుల్లోనే మ్యాచ్‌ను ముగించేసింది. తొలి ఓవర్ వేసిన సౌదీ బౌలర్ మహ్ నూర్ అమీర్ 11 ఎక్స్‌ట్రాలు ఇవ్వగా.. యూఏఈ బ్యాటర్ ఈషా ఓజా కేవలం 5 బంతుల్లో 15 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించింది. 

దీంతో మహిళల టీ20 చరిత్రలోనే అత్యంత వేగవంతమైన చేజింగ్‌(బంతులు పరంగా) చేసిన నాలుగో జట్టుగా యూఏఈ నిలిచింది. ఈ జాబితాలో రువండా అగ్రస్ధానంలో ఉంది. మాలీతో జరిగిన మ్యాచ్‌లో రువండా తొలి నాలుగు బంతుల్లోనే మ్యాచ్‌ను ముగించింది.
చదవండి: IND vs AFG: పంత్‌కు గంభీర్ క్లాస్.. లీక్ చేసిన అసిస్టెంట్ కోచ్!

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)