Breaking News

పసికూనపై ప్రతాపం.. క్లీన్‌ స్వీప్‌ చేసిన విండీస్‌, ఫాస్టెస్ట్‌ ఫిఫ్టి రికార్డు కూడా..!

Published on Sat, 06/10/2023 - 13:03

షార్జా వేదికగా యూఏఈతో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను వెస్టిండీస్‌ 3-0 తేడాతో క్లీన్‌ స్వీప్‌ చేసింది. నిన్న జరిగిన మూడో వన్డేలో విండీస్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శన కనబర్చి పసికూనపై ప్రతాపం చూపింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన యూఏఈ.. విండీస్‌ స్పిన్నర్లు కెవిన్‌ సింక్లెయిర్‌ (4/24), కారియ (2/34) మాయాజాలం ధాటికి 36.1 ఓవర్లలో 184 పరుగులకు చాపచుట్టేసింది.

యూఏఈ ఇన్నింగ్స్‌లో భారత సంతతి ఆటగాడు అరవింద్‌ (70) టాప్‌ స్కోరర్‌గా నిలువగా.. కెప్టెన్‌ ముహమ్మద్‌ వసీం (42), రమీజ్‌ షెహజాద్‌ (27), అలీ నసీర్‌ (13) మాత్రమే రెండంకెల స్కోర్‌ చేశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన విండీస్‌.. అలిక్‌ అతనాజే (45 బంతుల్లో 65; 9 ఫోర్లు, 3 సిక్సర్లు), షామారా బ్రూక్స్‌ (39), రోస్టన్‌ ఛేజ్‌ (27 నాటౌట్‌) రాణించడంతో మరో 89 బంతులు మిగిలుండగానే 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. యూఏఈ బౌలర్లలో అయాన్‌ అఫ్జల్‌, ముహమ్మద్‌ జవాదుల్లా, కార్తీక్‌ మెయ్యప్పన్‌ తలో 2 వికెట్లు పడగొట్టారు. కాగా, ఈ సిరీస్‌లో తొలి రెండు వన్డేల్లో విండీస్‌ ఘన విజయాలు సాధించిన విషయం తెలిసిందే.

అరంగేట్రంలో ఫాస్టెస్ట్‌ ఫిఫ్టి..
విండీస్‌ ఓపెనర్‌ అలిక్‌ అతనాజే వన్డే అరంగేట్రంలో ఫాస్టెస్ట్‌ ఫిఫ్టి సాధించాడు. అతనాజే 26 బంతుల్లో ఈ ఫీట్‌ సాధించాడు. తద్వారా టీమిండియా ఆల్‌రౌండర్‌ కృనాల్‌ పాండ్యా (26 బంతుల్లో) పేరిట ఉండిన రికార్డును సమం చేశాడు. టీమిండియాకే చెందిన మరో బ్యాటర్‌ ఇషాన్‌ కిషన్‌.. తన వన్డే అరంగేట్రంలో 33 బంతుల్లో ఫిఫ్టి చేశాడు. 

చదవండి: మిగతా వారు ఏదో ఒక రకంగా పనికొచ్చారు.. నువ్వేందుకు, దండగ.. ఉమేశ్‌పై ఫ్యాన్స్‌ ఫైర్‌

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)