కివీస్‌తో సిరీస్‌.. కొత్త కెప్టెన్‌గా అతడు! ‘ఫాస్టెస్ట్‌ సెంచరీ’ వీరుడి అరంగేట్రం!

Published on Wed, 08/16/2023 - 15:32

New Zealand tour of United Arab Emirates, 2023: న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ క్రికెట్‌ జట్టును ప్రకటించింది. సొంతగడ్డపై కివీస్‌తో పోరు నేపథ్యంలో 16 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసింది. ఈ సందర్భంగా తమ టీ20 కొత్త కెప్టెన్‌గా మహ్మద్‌ వసీం పేరును ఖరారు చేసినట్లు యూఏఈ క్రికెట్‌ బోర్డు వెల్లడించింది.

ఇంగ్లండ్‌ కంటే ముందు
కాగా ఇంగ్లండ్‌తో సిరీస్‌కు ముందు న్యూజిలాండ్‌.. యూఏఈతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ ఆడనుంది. ఆగష్టు 17, 19, 20 తేదీల్లో దుబాయ్‌ వేదికగా ఇరు జట్ల మధ్య మూడు టీ20లు జరుగనున్నాయి. ఈ క్రమంలో కివీస్‌ వంటి పటిష్ట జట్టుతో తలపడనున్న వసీం సారథ్యంలో 16 మంది సభ్యులున్న జట్టును ఎంపిక చేసినట్లు యూఏఈ బోర్డు బుధవారం తెలిపింది.

రిజ్వాన్‌ స్థానంలో వసీం
సీపీ రిజ్వాన్‌ స్థానంలో వసీం యూఏఈ టీ20 జట్టును ముందుకు నడిపించనున్నట్లు పేర్కొంది. కాగా కివీస్‌తో సిరీస్‌ సందర్భంగా అసోసియేట్‌ దేశాల్లో వన్డేల్లో ఫాస్టెస్ట్‌ సెంచరీ నమోదు చేసిన అసిఫ్‌ ఖాన్‌ అంతర్జాతీయ టీ20లలో అరంగేట్రం చేయనున్నాడు. అతడితో పాటు.. దేశవాళీ క్రికెట్‌లో అదరగిట్టిన ఆల్‌రౌండర్‌ ఫరాజుద్దీన్‌, స్పిన్నర్‌ జశ్‌ గియనానీ కూడా ఎంట్రీ ఇవ్వనున్నారు. 

న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు యూఏఈ జట్టు:
మహ్మద్‌ వసీం(కెప్టెన్‌), అలీ నాసీర్‌, అన్ష్‌ టాండన్‌, ఆర్యాంశ్‌ శర్మ, అసిఫ్‌ ఖాన్‌, అయాన్‌ అఫ్జల్‌ ఖాన్‌, బాసిల్‌ హమీద్‌, ఈథన్‌ డిసౌజా, ఫరాజుద్దీన్‌, జశ్‌ గియనానీ, జునైద్‌ సిద్దిఖి, లవ్‌ప్రీత్‌ సింగ్‌, మహ్మద్‌ జవాదుల్లా, సంచిత్‌ శర్మ, వ్రిత్య అరవింద్‌, జహూర్‌ ఖాన్‌.

యూఏఈతో సిరీస్‌కు కివీస్‌ జట్టు:
టిమ్‌ సౌతీ(కెప్టెన్‌), అది అశోక్‌, చాడ్‌ బోస్‌, మార్క్‌ చాప్‌మన్‌, డేన్‌ క్లీవర్‌, జాకబ్‌ డఫీ, డీన్‌ ఫాక్స్‌క్రాఫ్ట్‌, కైలీ జెమీషన్‌, బెన్‌ లిస్టర్‌, కోలీ మెకాంచి, జిమ్మీ నీషం, రచిన్‌ రవీంద్ర, మిచెల్‌ సాంట్నర్‌, టిమ్‌ సీఫర్ట్‌, విల్‌ యంగ్‌.

సిరీస్‌ వివరాలు
►ఆగష్టు 17, ఆగష్టు 19, ఆగష్టు 20- మూడు టీ20లు
►స్టార్‌ స్పోర్ట్స్‌, ఫ్యాన్‌కోడ్‌ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం
►దుబాయ్‌లోనే మూడు టీ20లు
►భారత కాలమానం ప్రకారం రాత్రి 7.30 గంటలకు మ్యాచ్‌లు ఆరంభం.

చదవండి: అక్కడ ఒక్కరాత్రికి 4 వేలు ఉండేది.. ఆరోజు మాత్రం ఏకంగా 60 వేలు!

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)