Breaking News

చివరి బెర్త్‌ కూడా ఖరారు.. టీ20 ప్రపంచకప్‌ ఆడబోయే జట్లు ఇవే..!

Published on Thu, 10/16/2025 - 19:39

2026 టీ20 ప్రపంచకప్‌ (T20 World Cup 2026) ఆడబోయే 20 జట్లు ఖరారయ్యాయి. చివరి బెర్త్‌ను తాజాగా యూఏఈ (UAE) దక్కించుకుంది. ఈస్ట్‌ ఏషియా పసిఫిక్‌ క్వాలిఫయర్స్‌లో (East Asia Pacific Qualifier) జపాన్‌పై గెలుపుతో యూఏఈ ప్రపంచకప్‌ బెర్త్‌ ఖరారు చేసుకుంది. ఇదే రీజియనల్‌ క్వాలిఫయర్ ద్వారా నిన్ననే ఒమన్‌, నేపాల్‌ ప్రపంచకప్‌ బెర్త్‌లు ఖరారు చేసుకున్నాయి.

భారత్‌, శ్రీలంక వేదికలుగా వచ్చే ఏడాది జరుగబోయే పొట్టి ప్రపంచకప్‌కు అర్హత సాధించిన జట్లపై ఓ లుక్కేద్దాం. ముందుగా ఆతిథ్య హోదాలో భారత్‌, శ్రీలంక నేరుగా అర్హత సాధించాయి. ఆతర్వాత గత ప్రప​ంచకప్‌లో (2024) సూపర్‌-8 దశకు చేరిన 7 జట్లు (ఆఫ్ఘనిస్తాన్‌, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్‌, ఇంగ్లండ్‌, సౌతాఫ్రికా, వెస్టిండీస్‌, యూఎస్‌ఏ) నేరుగా అర్హత సాధించాయి.  

ఐసీసీ ర్యాంకింగ్స్‌ ఆధారంగా పాకిస్తాన్‌, న్యూజిలాండ్‌, ఐర్లాండ్‌ జట్లు ప్రపంచకప్‌ బెర్త్‌లు దక్కించుకున్నాయి. అమెరికా రీజియనల్‌ క్వాలిఫయర్‌ ద్వారా కెనడా అర్హత సాధించింది.

యూరప్‌ క్వాలిఫయర్స్‌ ద్వారా నెదర్లాండ్స్‌, ఇటలీ అర్హత సాధించాయి. అఫ్రికా క్వాలిఫయర్‌ ద్వారా నమీబియా, జింబాబ్వే క్వాలిఫై అయ్యాయి. చివరిగా ఈస్ట్‌ ఏషియా పసిఫిక్‌ క్వాలిఫయర్ ద్వారా ఒమన్‌, నేపాల్‌, యూఏఈ జట్లు ప్రపంచకప్‌ బెర్త్‌లు ఖరారు చేసుకున్నాయి. 

చదవండి: తేలిపోయిన బంగ్లా బ్యాటర్లు.. ఆస్ట్రేలియా టార్గెట్‌ ఎంతంటే..?

 

 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)