Breaking News

చరిత్ర సృష్టించిన ఆసీస్‌ యువ బ్యాటర్‌.. ఫాస్టెస్ట్‌ సెంచరీ

Published on Wed, 01/21/2026 - 15:36

జింబాబ్వే, నమీబియా వేదికలుగా జరుగుతున్న అండర్‌-19 వరల్డ్‌కప్‌ 2026లో ఆస్ట్రేలియా ఓపెనింగ్‌ బ్యాటర్‌ విల్ మలాజ్‌చుక్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. నిన్న (జనవరి 20) గ్రూప్‌-ఏలో భాగంగా జపాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 51 బంతుల్లోనే శతక్కొట్టాడు. తద్వారా అండర్‌-19 వరల్డ్‌కప్‌ చరిత్రలో ఫాస్టెస్ట్‌ సెంచరీ చేసిన బ్యాటర్‌గా రికార్డుల్లోకెక్కాడు.

గతంలో ఈ రికార్డు పాకిస్తాన్‌ ఆటగాడు ఖాసిం అక్రమ్‌ పేరిట ఉండేది. ఖాసిమ్‌ 2022 ఎడిషన్‌లో శ్రీలంకపై 63 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. ఖాసిమ్‌ తర్వాత మూడో వేగవంతమైన సెంచరీ రికార్డు భారత ఆటగాడు రాజ్‌ బవా పేరిట ఉంది. బవా 2022 ఎడిషన్‌లోనే ఉగాండపై 69 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు.

మలాజ్‌చుక్ విషయానికొస్తే.. ఇతగాడు జపాన్‌పై మొత్తంగా 55 బంతులు ఎదుర్కొని 12 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 102 పరుగులు చేశాడు. ఫలితంగా ఆసీస్‌ పసికూన జపాన్‌పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ టోర్నీలో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ హోదాలో బరిలోకి దిగిన ఆసీస్‌కు ఇది వరసగా రెండో విజయం. అంతకుముందు తమ తొలి మ్యాచ్‌లో ఐర్లాండ్‌ను కూడా 8 వికెట్ల తేడాతోనే చిత్తు చేసింది.

ఆసీస్‌తో మ్యాచ్‌లో జపాన్‌ తొలుత బ్యాటింగ్‌ చేసి నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. వన్‌డౌన్‌ బ్యాటర్‌ హ్యూగో కెల్లీ (79 నాటౌట్‌) అర్ద సెంచరీతో రాణించడంతో జపాన్‌ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. కెల్లీకి నిహార్‌ పర్మార్‌ (33), చార్లెస్‌ హి​ంజ్‌ (24), హర హింజ్‌ (29) ఓ మోస్తరు సహాకారాలను అందించారు. ఆసీస్‌ బౌలర్లలో కూరే 3, విల్‌ బైరోమ్‌ 2, ఆర్యన్‌ శర్మ, కేసీ బార్టన్‌ తలో వికెట్‌ తీశారు.

అనంతరం 202 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్‌ సునాయాసంగా ఛేదించింది. మలాజ్‌చుక్ మెరుపు సెంచరీకి మరో ఓపెనర్‌ నితేశ్‌ సామ్యూల్‌ (60 నాటౌట్‌) బాధ్యతాయుతమైన అర్ద సెంచరీ తోడవ్వడంతో ఆసీస్‌ 29.1 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. 

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)