సౌతాఫ్రికాకు షాకిచ్చిన ఆఫ్ఘనిస్తాన్‌

Published on Sat, 01/17/2026 - 07:42

అండర్‌-19 ప్రపంచకప్‌ 2026లో ఆఫ్ఘనిస్తాన్‌ బోణీ కొట్టింది. నిన్న (జనవరి 16) జరిగిన తమ తొలి మ్యాచ్‌లో తమ కంటే మెరుగైన సౌతాఫ్రికాకు ఊహించని షాకిచ్చింది. తొలుత బ్యాటింగ్‌ చేసి నిర్ణీత 50 ఓవర్లలో 266 పరుగులు (8 వికెట్ల నష్టానికి) చేసిన ఆ జట్టు.. ఆతర్వాత సౌతాఫ్రికాను 238 పరుగులకే ఆలౌట్‌ చేసి, 28 పరుగుల తేడాతో గెలుపొందింది.  

తొలుత ఖలీద్‌ అహ్మద్‌ (74), ఫైసల్‌ షినోజాదా (81), ఉజైరుల్లా నియాజాయ్‌ (51 నాటౌట్‌) అర్ద సెంచరీలతో రాణించి ఆఫ్ఘనిస్తాన్‌కు గౌరవప్రదమైన స్కోర్‌ అందించారు. ఆతర్వాత అబ్దుల్‌ అజీజ్‌, ఖటిర్‌ స్టానిక్‌జాయ్‌ తలో 2, నూరిస్తానీ ఒమర్‌జాయ్‌, హఫీజ్‌ జద్రాన్‌ చెరో వికెట్‌ తీసి సౌతాఫ్రికాను దెబ్బేశారు. ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘన్‌ ఫీలర్డు మైదానంలో పదరసంలా కదిలారు. ఏకంగా నలుగురు సౌతాఫ్రికా ఆటగాళ్లను రనౌట్‌ చేశారు.

సౌతాఫ్రికా విషయానికొస్తే.. తొలుత బౌలింగ్‌లో బుయండా మజోలా, కోర్నే బోథా తలో 3, జేజే బస్సన్‌ ఓ వికెట్‌ తీసి రాణించారు. ఆతర్వాత బ్యాటింగ్‌లో జేసన్‌ రోల్స్‌ (98) అద్భుతంగా రాణించినా సౌతాఫ్రికాను గట్టెక్కించలేకపోయాడు. రోల్స్‌ సెంచరీకి ముందు రనౌట్‌ కావడంతో సౌతాఫ్రికా పరిస్థితి తారుమారయ్యింది. చివర్లో సౌతాఫ్రికా ఆటగాళ్లు ఒత్తిడికి లోనై అనవసరపు రనౌట్లయ్యారు. ఫలితంగా మ్యాచ్‌ను కోల్పోయారు. ఈ గెలుపు క్రెడిట్‌ ఆఫ్ఘనిస్తాన్‌ ఫీల్డర్లకే దక్కుతుంది.

కాగా, ప్రపంచకప్‌లో భాగంగా నిన్ననే జరిగిన మరో రెండు మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా జట్లు కూడా బోణీ కొట్టాయి. ఇంగ్లండ్‌ పాకిస్తాన్‌ను.. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఆస్ట్రేలియా ఐర్లాండ్‌ను చిత్తుగా ఓడించాయి. ఇవాళ (జనవరి 17) బంగ్లాదేశ్‌ భారత్‌తో తలపడుతుంది. భారతకాలమానం ప్రకారం ఈ మ్యాచ్‌ మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రారంభమవుతుంది. ఈ మెగా టోర్నీలో భారత్‌ ఇదివరకే బోణీ కొట్టింది. తొలి మ్యాచ్‌లో యూఎస్‌ఏపై ఘన విజయం సాధించింది. 
 

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)