Breaking News

9 నెలల వ్యవధిలో భారత క్రికెట్‌ అభిమానులకు మూడోసారి గుండెకోత

Published on Sun, 02/11/2024 - 22:27

తొమ్మిది నెలల వ్యవధిలో టీమిండియా అభిమానుల గుండె మూడోసారి కోతకు గురైంది. ఇటీవలికాలంలో జరిగిన అన్ని మేజర్‌ ఈవెంట్ల ఫైనల్స్‌లో టీమిండియా వరుస పరాభవాలను ఎదుర్కొంది. భారత్‌కు ఓటములు ఎదురైన మూడు సందర్భాల్లో ప్రత్యర్ధి ఆస్ట్రేలియానే కావడం విశేషం.  

తొలుత వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ 2021-23 ఫైనల్స్‌లో ఆస్ట్రేలియా టీమిండియా​ను చిత్తు చేసింది. ఆతర్వాత గతేడాది చివర్లో జరిగిన వరల్డ్‌కప్‌ ఫైనల్లో, తాజాగా అండర్‌ 19 వరల్డ్‌కప్‌ ఫైనల్స్‌లో భారత క్రికెట్‌ జట్టు ఆసీస్‌ చేతిలో ఓటమిపాలైంది.  

సీనియర్ల బాటలోనే జూనియర్లు.. 
భారత క్రికెట్‌ జట్టును వరల్డ్‌కప్‌ ఫైనల్‌ ఫోబియా వదలట్లేదు. గతేడాది చివర్లో జరిగిన వన్డే వరల్డ్‌కప్‌ ఫైనల్లో భారత సీనియర్లు ఇదే ఆసీస్‌ చేతిలో ఘోర పరాభవాన్ని ఎదుర్కోగా.. తాజాగా జూనియర్లు సీనియర్ల బాటలోనే నడుస్తూ అండర్‌ 19 వరల్డ్‌కప్‌ ఫైనల్లో కుర్ర ఆసీస్‌ జట్టు చేతిలో ఓటమిపాలయ్యారు. ప్రస్తుత ఎడిషన్‌లో ఫైనల్‌ వరకు అజేయ జట్టుగా నిలిచిన భారత్‌ సీనియన్‌ టీమిండియాలాగే తుది సమరంలో బొక్కబోర్లా పడి భారత క్రికెట్‌ అభిమానులకు గుండెకోత మిగిల్చింది. 

ఇదిలా ఉంటే, అండర్‌ 19 వరల్డ్‌కప్‌ 2024 ఫైనల్లో కుర్ర ఆస్ట్రేలియా  జట్టు యంగ్‌ ఇండియాను 79 పరుగుల తేడాతో ఓడించింది. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేయగా.. ఛేదనలో చేతులెత్తేసిన యంగ్‌ ఇండియా 43.5 ఓవర్లలో 174 పరుగులకు కుప్పకూలి వంద కోట్లకు పైగా ఉన్న భారతీయులకు గుండెకోతను మిగిల్చింది. 

Videos

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)