Breaking News

పూర్వ వైభవం దిశగా అడుగులు వేస్తున్న విండీస్‌

Published on Fri, 12/22/2023 - 12:48

వివిధ కారణాల చేత పరిమిత ఓవర్ల స్పెషలిస్ట్‌లంతా ఒక్కసారిగా జట్టు నుంచి తప్పుకోవడంతో వన్డే ప్రపంచకప్‌కు సైతం అర్హత సాధించలేక ఇంటాబయటా విమర్శలు ఎదుర్కొన్న వెస్టిండీస్‌ క్రికెట్‌ జట్టు ఇటీవలికాలంలో పూర్వ వైభవం దిశగా అడుగులు వేస్తుంది. రసెల్‌, పూరన్‌ లాంటి సీనియర్లు తిరిగి జట్టులో చేరడంతో కరీబియన్‌ జట్టు  ఇంటాబయటా వరుస సిరీస్‌ విజయాలతో దూసుకుపోతుంది.

తాజాగా స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే, టీ20 సిరీస్‌లను కైవసం చేసుకున్న ఈ మాజీ వరల్డ్‌ ఛాంపియన్‌.. దీనికి ముందు స్వదేశంలోనే భారత్‌పై 3-2 తేడాతో టీ20 సిరీస్‌ నెగ్గింది. దీనికి ముందు సౌతాఫ్రికాలో వారిపై 2-1 తేడాతో టీ20 సిరీస్‌ గెలిచింది.

వచ్చే ఏడాది స్వదేశంలో టీ20 వరల్డ్‌కప్‌ ఉండటంతో ఇప్పటినుంచే సన్నాహకాలను మొదలుపెట్టిన విండీస్‌ బోర్డు జట్టును వీడిన సీనియర్లనంతా ఒక్కొక్కరిగా తిరిగి జట్టులోకి ఆహ్వానిస్తుంది. ప్రస్తుతం విండీస్‌ ఉన్న ఊపు చూస్తుంటే మూడోసారి టీ20 ఛాంపియన్‌గా నిలవడం ఖయామని అనిపిస్తుంది. 

కాగా, ట్రినిడాడ్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన నిర్ణయాత్మక ఐదో టీ20లో వెస్టిండీస్‌ 4 వికెట్ల తేడాతో గెలుపొంది, 3-2 తేడాతో సిరీస్‌ కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌.. 19.3 ఓవర్లలో 132 పరుగులకే ఆలౌటైంది. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన వెస్టిండీస్‌.. 19.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరుకుంది.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)