Breaking News

'టైమ్‌ వేస్ట్‌'.. భారత్‌-సౌతాఫ్రికా టెస్టు సిరీస్‌పై రవిశాస్త్రి సంచలన వ్యాఖ్యలు

Published on Fri, 01/05/2024 - 10:46

దక్షిణాఫ్రికా పర్యటనను టీమిండియా విజయంతో ముగించింది. కేప్‌టౌన్‌ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో 7 వికెట్ల తేడాతో భారత జట్టు విజయ భేరి ముగించింది. దీంతో సిరీస్‌ను భారత్‌ 1-1తో సమం చేసింది. ఈ మ్యాచ్‌ను కేవలం ఐదు సెషన్లలోనే టీమిండియా ముగించింది. టెస్టు క్రికెట్‌ చరిత్రలోనే అత్యంత వేగంగా ముగిసిన టెస్టుగా ఈ మ్యాచ్‌ నిలిచింది.

అయితే సిరీస్‌ డ్రాగా ముగియడంపై టీమిండియా మాజీ హెడ్‌కోచ్‌ రవిశాస్త్రి ఆసంతృప్తి వ్యక్తం చేశాడు. రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను నిర్వహించడం సమయం వృధా అని రవిశాస్త్రి తెలిపాడు. అదనంగా మరో టెస్టును ఆడించి వుంటే సిరీస్‌ ఫలితం తేలి ఉండేదని రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాగా రవిశాస్త్రి వ్యాఖ్యలతో చాలా  మంది మాజీ క్రికెటర్లు సైతం ఏకీభవిస్తున్నారు.

కాగా అంతకుముందు దక్షిణాఫ్రికా క్రికెట్‌ దిగ్గజం ఏబీ డివిలియర్స్‌ కూడా ఈ తరహా వ్యాఖ్యలే చేశాడు. భారత్‌-దక్షిణాఫ్రికా మధ్య టెస్టు సిరీస్‌ కేవలం రెండు మ్యాచ్‌లకు మాత్రమే పరిమితం కావడం సిగ్గు చేటు అని ఏబీడీ విమర్శించాడు. 

గొప్ప చరిత్ర ఉన్న దక్షిణాఫ్రికా- భారత్‌ సిరీస్‌లో కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే పెట్టడం నిజంగా అవమానకరం అంటూ డివిలియర్స్‌ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఇక దక్షిణాఫ్రికా పర్యటనకు వచ్చిన భారత్‌ జట్టు టీ20, వన్డే సిరీస్‌లను సొంతం చేసుకోగా.. టెస్టు సిరీస్‌ను డ్రాగా ముగించింది.

Videos

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)