Breaking News

కావ్యా మార‌న్ టీమ్ కొంప ముంచిన వ‌రుణుడు.. ఫైనల్‌ నుంచి ఔట్‌?

Published on Sun, 08/31/2025 - 13:09

ది హండ్రెడ్ మెన్స్ కాంపిటీషన్ 2025 తుది ద‌శ‌కు చేరుకుంది. ఈ టోర్నీలో భాగంగా శ‌నివారం లండన్ వేదికగా ట్రెంట్ రాకెట్స్,  నార్తర్న్ సూపర్‌చార్జర్స్ మ‌ధ్య జరగాల్సిన ఎలిమినిటేర్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. దీంతో పాయింట్ల పట్టికలో రెండో స్ధానంలో నిలిచిన ట్రెంట్ రాకర్స్ ఫైనల్లో అడుగు పెట్టింది.

పాయింట్ల పట్టికలో రాకర్స్(24) రెండో స్దానంలో నిలవగా.. సూపర్‌చార్జర్స్(20) మూడో స్ధానంతో సరిపెట్టుకుంది.  కాగా వర్షం కారణంగా రద్దు అయిన ఈ మ్యాచ్‌లో తొలుత నార్తర్న్ సూపర్‌చార్జర్స్ బ్యాటింగ్ చేసింది. సూపర్ చార్జర్స్ బ్యాటింగ్ సందర్భంగా వరుణుడు పదేపదే అంతరాయం కలిగించాడు.

సూపర్ చార్జర్స్ స్కోర్ 75 బంతుల్లో 5 వికెట్ల నష్టానికి 119 పరుగుల వద్ద భారీ వర్షం కారణంగా మ్యాచ్‌ను నిలిపివేశారు. ఆ తర్వాత సుమారు గంట సేపు వర్షం కారణంగా ఆట నిలిచిపోయింది. దీంతో సూపర్ ఛార్జర్స్ ఇన్నింగ్స్ ముగియగా.. డక్‌వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం ట్రెంట్ రాకర్స్ లక్ష్యాన్ని 75 బంతుల్లో 134గా నిర్ణయించారు.

అయితే ట్రెంట్ రాకెట్స్ లక్ష్య చేధనకు దిగి కేవలం ఐదు బంతులు మాత్రమే ఆడగా మళ్లీ వరుణుడు ఎంట్రీ ఇచ్చాడు. ఈసారి ఎప్పటికి వర్షం తగ్గుముఖం పట్టకపోవడంతో మ్యాచ్‌ను అంపైర్‌లు రద్దు చేశారు. దీంతో కావ్యామారన్ టీమ్‌కు నిరాశే ఎదురైంది. కాగా నార్తర్న్ సూపర్‌చార్జర్స్ జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్ సిస్టర్ ఫ్రాంచైజీ కావడమే గమనార్హం.

ఇక ఆదివారం లార్డ్స్ వేదికగా జరగనున్న ఫైనల్లో ఓవల్ ఇన్విన్సిబుల్స్, ట్రెంట్ రాకెట్స్ జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. మరోవైపు మహిళల ఫైనల్లో  సదరన్ బ్రేవ్ ఉమెన్, నార్తర్న్ సూపర్‌చార్జర్స్ జ‌ట్లు తలపడనున్నాయి.
చదవండి: The Hundred: టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచ‌రీ..! ఎవ‌రీ డేవినా పెర్రిన్?
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)