చరిత్ర సృష్టించిన ట్రావిస్‌ హెడ్‌

Published on Sat, 10/25/2025 - 10:18

ఆస్ట్రేలియా ఓపెనర్‌ ట్రావిస్‌ హెడ్‌ (Travis Head) చరిత్ర సృష్టించాడు. ఆసీస్‌ తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో వన్డేల్లో అత్యంత వేగంగా మూడు వేల పరుగుల మైలురాయిని చేరుకున్న క్రికెటర్‌గా నిలిచాడు. టీమిండియాతో శనివారం నాటి మూడో వన్డే (IND vs AUS 3rd ODI) సందర్భంగా హెడ్‌ ఈ ఘనత సాధించాడు.

స్వదేశంలో ఆస్ట్రేలియా భారత్‌తో మూడు వన్డే, ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ ఆడుతోంది. ఇందులో భాగంగా తొలుత వన్డే సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకున్న కంగారూలు.. సిడ్నీ వేదికగా నామమాత్రపు మూడో వన్డేలోనూ శుభారంభం అందుకున్నారు.

వన్డేల్లో మూడు వేల పరుగుల క్లబ్‌లో
సిడ్నీ గ్రౌండ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది ఆస్ట్రేలియా. కెప్టెన్‌, ఓపెనర్‌ మిచెల్‌ మార్ష్‌ (Mitchell Marsh)తో కలిసి ట్రావిస్‌ హెడ్‌ వేగంగా ఆడే ప్రయత్నం చేశాడు. ఈ ఎడమచేతి వాటం బ్యాటర్‌.. 22 పరుగుల (20 బంతుల్లో) వ్యక్తిగత స్కోరు వద్ద ఉన్న వేళ వన్డేల్లో మూడు వేల పరుగుల క్లబ్‌లో చేరాడు.  

స్మిత్‌ రికార్డు బ్రేక్‌
కాగా ఆసీస్‌ తరఫున హెడ్‌కు ఇది 76వ ఇన్నింగ్స్‌. తద్వారా తక్కువ ఇన్నింగ్స్‌లోనే వన్డేల్లో మూడు వేల పరుగులు పూర్తి చేసుకున్న ఆసీస్‌ క్రికెటర్‌గా స్టీవ్‌ స్మిత్‌ సాధించిన రికార్డును హెడ్‌ తాజాగా బద్దలు కొట్టాడు. స్మిత్‌ 79 ఇన్నింగ్స్‌లో ఈ ఘనత సాధిస్తే.. హెడ్‌ 76 ఇన్నింగ్స్‌లోనే ఈ మైలురాయిని చేరుకోవడం విశేషం.

అంతేకాదు.. అతితక్కువ బంతుల్లో వన్డేల్లో మూడు వేల పరుగులు పూర్తి చేసుకున్న బ్యాటర్ల జాబితాలో హెడ్‌ ఈ సందర్భంగా చోటు సంపాదించాడు. ఈ లెఫ్టాండర్‌ బ్యాటర్‌ 2839 బంతుల్లో మూడువేల పరుగుల మార్కును అందుకున్నాడు.

సిరాజ్‌ బౌలింగ్‌లో..
ఇక ఆసీస్‌ ఇన్నింగ్స్‌ పదో ఓవర్‌లో భారత పేసర్‌ మొహమ్మద్‌ సిరాజ్‌ బంతితో రంగంలోకి దిగగా.. హెడ్‌.. ఫోర్‌తో అతడికి స్వాగతం పలికాడు. అయితే, రెండో బంతికే సిరాజ్‌ అతడిని పెవిలియన్‌కు పంపి ప్రతీకారం తీర్చుకున్నాడు.

సిరాజ్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించిన హెడ్‌.. బ్యాక్‌వర్డ్‌ పాయింట్‌ దిశగా బంతిని గాల్లోకి లేపాడు. ఈ క్రమంలో ప్రసిద్‌ కృష్ణ క్యాచ్‌ అందుకోవడంతో టీమిండియాకు ‘హెడేక్‌’ తప్పింది. 

25 బంతుల్లో ఆరు ఫోర్ల సాయంతో 29 పరుగులు చేసిన హెడ్‌ మరో బౌండరీ బాదే క్రమంలో అవుటయ్యాడు. దీంతో ఆసీస్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. 15 ఓవర్ల ఆట ముగిసే సరికి ఆస్ట్రేలియా వికెట్‌ నష్టానికి 88 పరుగులు చేసింది. మార్ష్‌ 41, మాథ్యూ షార్ట్‌ 10 పరుగులతో క్రీజులో నిలిచారు.

ఆస్ట్రేలియా తరఫున అత్యంత వేగంగా వన్డేల్లో మూడు వేల పరుగులు సాధించిన క్రికెటర్లు
🏏ట్రావిస్‌ హెడ్‌- 76 ఇన్నింగ్స్‌లో
🏏స్టీవ్‌ స్మిత్‌- 79 ఇన్నింగ్స్‌లో
🏏మైఖేల్‌ బేవాన్‌/జార్జ్‌ బెయిలీ- 80 ఇన్నింగ్స్‌లో
🏏డేవిడ్‌ వార్నర్‌- 81 ఇన్నింగ్స్‌లో

వన్డేల్లో తక్కువ బంతుల్లోనే 3 వేల పరుగుల క్లబ్‌లో చేరిన క్రికెటర్లు
🏏గ్లెన్‌ మాక్స్‌వెల్‌ (ఆస్ట్రేలియా)- 2440 బంతుల్లో
🏏జోస్‌ బట్లర్‌ (ఇంగ్లండ్‌)- 2533 బంతుల్లో
🏏జేసన్‌ రాయ్‌ (ఇంగ్లండ్‌)- 2820 బంతుల్లో
🏏ట్రావిస్‌ హెడ్‌ (ఆస్ట్రేలియా)- 2839 బంతుల్లో
🏏జానీ బెయిర్‌స్టో (ఇంగ్లండ్‌)- 2842 బంతుల్లో.
 చదవండి: అవమాన భారంతో ప్రపంచకప్‌ నుంచి నిష్క్రమించిన పాకిస్తాన్‌

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)