Breaking News

ఆస్ట్రేలియా సెలెక్టర్ల కీలక నిర్ణయం

Published on Mon, 11/03/2025 - 13:14

నవంబర్‌ 6న గోల్డ్‌కోస్ట్‌ వేదికగా భారత్‌తో జరుగబోయే నాలుగో టీ20కి ముందు ఆస్ట్రేలియా సెలెక్టర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. విధ్వంసకర ఓపెనింగ్‌ బ్యాటర్‌ ట్రవిస్‌ హెడ్‌ను (Travis Head) జట్టు నుంచి విడుదల చేశారు. షెఫీల్డ్ షీల్డ్‌లో సౌత్ ఆస్ట్రేలియా తరఫున ఆడాలని ఆదేశించారు. 

ఆసీస్‌ సెలెక్టర్ల ఈ నిర్ణయం యాషెస్‌ సిరీస్‌ వ్యూహాల్లో భాగంగా తీసుకోబడింది. పని భారం తగ్గించే క్రమంలో హెడ్‌కు చివరి రెండు టీ20లకు విశ్రాంతి కల్పించారు. హెడ్‌ స్థానాన్ని ఎవరూ భర్తీ చేస్తారో సెలెక్టర్లు చెప్పలేదు.

అంత​కుముందు మరికొందరు సీనియర్లను కూడా భారత్‌ను ఎదుర్కొనే టీ20 జట్టు నుంచి రిలీజ్‌ చేశారు. స్టీవ్ స్మిత్‌, మిచెల్ స్టార్క్‌, జోష్ హాజిల్‌వుడ్‌ షెఫీల్డ్‌ షీల్డ్‌లో న్యూసౌత్ వేల్స్ తరఫున ఆడతారు. కెమరూన్ గ్రీన్ వెస్ట్రన్ ఆస్ట్రేలియాకు ప్రాతినిథ్యం వహించనున్నాడు.

హెడ్‌ భారత్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తొలి మూడు మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో హెడ్‌ చెప్పుకోదగ్గ ప్రదర్శనలేమీ చేయలేదు. రెండో టీ20లో 28, మూడో మ్యాచ్‌లో 6 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచిన హెడ్‌.. అంతకుముందు మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లోనూ దారుణంగా విఫలమయ్యాడు. వరుసగా 8, 28, 29 స్కోర్లు చేశాడు.

కాగా, ప్రస్తుతం భారత్‌తో జరుగుతున్న సిరీస్‌లో ఆస్ట్రేలియా 1-1 సమంగా ఉంది. తొలి మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దు కాగా.. రెండో టీ20లో ఆస్ట్రేలియా, మూడో మ్యాచ్‌లో భారత్‌ గెలుపొందాయి.

భారత్‌తో నాలుగు, ఐదు టీ20లకు ఆస్ట్రేలియా జట్టు..
మిచెల్‌ మార్ష్‌, టిమ్‌ డేవిడ్‌, మిచెల్‌ ఓవెన్‌, మాథ్యూ షార్ట్‌, మార్కస్‌ స్టోయినిస్‌, గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌, మహ్లి బియర్డ్‌మన్‌, జేవియర్‌ బార్ట్‌లెట్‌, నాథన్‌ ఇల్లిస్‌, జోష్‌ ఇంగ్లిస్‌, జోష్‌ ఫిలిప్‌, జేవియర్‌ బార్ట్‌లెట్‌, బెన్‌ డ్వార్షుయిస్‌, మాథ్యూ కుహ్నేమన్‌, ఆడమ్‌ జంపా

చదవండి: విశ్వ విజేతల వెనుక త్యాగాల గాథ

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)