Breaking News

రోహిత్ నిర్ణ‌యం స‌రైన‌దే.. నేనైనా అలానే చేసేవాడని: హెడ్‌

Published on Tue, 11/19/2024 - 08:41

బోర్డర్-గావస్కర్ ట్రోఫీ సిరీస్‌ (Border-Gavaskar Trophy) ప్రారంభానికి సమయం అసన్నమైంది. మరో రెండు రోజుల్లో భారత్‌-ఆసీస్ మధ్య ఈ ప్రతిష్టాత్మక ట్రోఫీకి తెరలేవనుంది. ఈ బీజీటీ ట్రోఫీలో భాగంగా తొలి టెస్టు నవంబర్ 22 నుంచి పెర్త్ వేదికగా ఆరంభం కానుంది.

అయితే ఈ మ్యాచ్‌కు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ  దూరం కానున్నాడు.రోహిత్ భార్య  రితికా సజ్దే కొన్నిరోజుల కిందటే పండింటి మగబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో రోహిత్ జ‌ట్టుతో పాటు ఆస్టేలియాకు వెళ్ల‌కుండా భార‌త్‌లోనే ఉండిపోయాడు. అయితే మ‌రి కొన్ని రోజుల పాటు భార్య‌తో పాటే ఉండాల‌ని హిట్‌మ్యాన్ నిర్ణ‌యించుకున్నాడు. ఈ క్ర‌మంలో పెర్త్ టెస్టుకు రోహిత్ దూర‌మ‌య్యాడు.

అయితే రోహిత్ నిర్ణ‌యాన్ని కొంతమంది అభిమానులు సోష‌ల్ మీడియా త‌ప్పుబ‌ట్టారు. ముందుగానే త‌న భార్య బిడ్డ‌కు జ‌న్మ‌నివ్వ‌డంతో రోహిత్ తొలి టెస్టులో ఆడింటే బాగుండేద‌ని అభిప్రాయప‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలో ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ మాత్రం రోహిత్‌కు సపోర్ట్‌గా నిలిచాడు. టీమిండియా కెప్టెన్ తీసుకున్న నిర్ణ‌యం స‌రైన‌దేన‌ని హెడ్ తెలిపాడు.

"రోహిత్ శ‌ర్మ తీసుకున్న నిర్ణ‌యం వంద శాతం స‌రైన‌దే. అత‌డికి నేను పూర్తి మ‌ద్ద‌తు ఇస్తున్నాను.  అదే పరిస్థితిలో నేను ఉన్నా రోహిత్‌లానే ఆలోచిస్తాను. క్రికెటర్లగా మేము ఎన్నో త్యాగాలు చేస్తున్నాము. వృత్తిని, ఫ్యామిలీని రెండూ బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది. కొన్నిసార్లు ముఖ్యమైన మ్యాచ్‌లు కూడా కోల్పోవాల్సి వస్తుంది.

ఇక ఆస్ట్రేలియా గడ్డపై భారత్‌కు మంచి రికార్డు ఉంది. గత రెండు పర్యటనలలో కీలక ఆటగాళ్లు గాయాలతో దూరంగా ఉన్నప్పటికి భారత్ అద్భుతమైన విజయాలు నమోదు చేసింది. మా దృష్టిలో భారత్ ఎప్పుడూ బలమైన జట్టే" అని ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హెడ్ పేర్కొన్నాడు.
చదవండి: న్యూజిలాండ్‌ స్టార్‌ క్రికెటర్‌పై నిషేధం..


 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)