Breaking News

సమష్టిగా రాణిస్తేనే...

Published on Thu, 12/21/2023 - 03:51

పార్ల్‌: సఫారీ గడ్డపై రెండోసారి వన్డే సిరీస్‌ సాధించాలనే లక్ష్యంతో... నేడు దక్షిణాఫ్రికాతో జరిగే చివరిదైన మూడో మ్యాచ్‌లో భారత్‌ బరిలోకి దిగనుంది. కేఎల్‌ రాహుల్‌ నాయకత్వంలోని టీమిండియా తొలి వన్డేలో ఘనవిజయం సాధించినా... రెండో వన్డేలో మాత్రం తడబడింది. బ్యాటింగ్‌తోపాటు బౌలింగ్‌లోనూ నిరాశాజనక ప్రదర్శన కనబరిచింది. ఓపెనర్‌ సాయి సుదర్శన్‌ రెండు మ్యాచ్‌ల్లోనూ అర్ధ సెంచరీలు సాధించాడు.

మరో ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్, వన్‌డౌన్‌ బ్యాటర్‌ తిలక్‌ వర్మ ఆకట్టుకోలేకపోయారు. తొలి మ్యాచ్‌లో అర్‌‡్షదీప్‌ సింగ్, అవేశ్‌ ఖాన్‌ అదరగొట్టగా... ముకేశ్‌ కుమార్‌ ఒక్క వికెట్‌ కూడా తీయలేకపోయాడు. మూడో మ్యాచ్‌లో భారత్‌ గెలవాలంటే సమష్టిగా రాణించాల్సిన అవసరం ఉంది. ఫామ్‌ కోల్పోయిన తిలక్‌ వర్మ స్థానంలో మధ్యప్రదేశ్‌ బ్యాటర్‌ రజత్‌ పటిదార్‌ తుది జట్టులోకి వచ్చే అవకాశముంది.

మరోవైపు రెండో వన్డేలో సాధించిన విజయంతో దక్షిణాఫ్రికా ఆత్మవిశ్వాసంతో ఉంది. ఓపెనర్‌ టోని జోర్జి సెంచరీ సాధించి ఫామ్‌లోకి వచ్చాడు. మార్క్‌రమ్, రీజా హెన్‌డ్రిక్స్, క్లాసెన్, డసెన్, మిల్లర్‌ కూడా రాణిస్తే ఆ జట్టు మరో విజయంపై ఆశలు పెట్టుకోవచ్చు. మూడో మ్యాచ్‌ వేదికైన పార్ల్‌లో భారత్‌పై దక్షిణాఫ్రికాదే పైచేయిగా ఉంది. గత ఏడాది ఈ వేదికపై భారత్‌తో జరిగిన రెండు వన్డేల్లోనూ దక్షిణాఫ్రికానే గెలిచింది. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)