Breaking News

ఆరో ప్రపంచకప్‌ వేటలో భారత్‌.. ఫైనల్లో ఆసీస్‌తో ఢీ

Published on Sun, 02/11/2024 - 03:45

బెనోని (దక్షిణాఫ్రికా): డిఫెండింగ్‌ చాంపియన్‌ భారత్‌ ఆరో ప్రపంచకప్‌ లక్ష్యంగా అంతిమ సమరానికి సన్నద్ధమైంది. ఈ టోర్నీలో పరాజయమెరుగని భారత జట్టు ఆదివారం జరిగే ఫైనల్లో ఆ్రస్టేలియాతో తలపడనుంది. డిఫెండింగ్‌ చాంపియన్‌ ఈ టోర్నీలో అసాధారణ ఫామ్‌లో ఉంది. కుర్రాళ్ల మెగా ఈవెంట్‌ చరిత్రలో తొమ్మిదోసారి టైటిల్‌ వేటకు అర్హత సాధించిన భారత్‌కు ఫైనల్‌ ప్రత్యర్థిపై మంచి రికార్డు ఉంది. ఆసీస్‌ ఐదుసార్లు ఫైనల్‌ చేరింది.

పాక్‌ (1988, 2010), దక్షిణాఫ్రికా (2002)లపై గెలిచిన ఆసీస్‌కు 2012, 2018లలో జరిగిన ఫైనల్స్‌లో మాత్రం రెండు సార్లు భారత్‌ చేతిలో పరాభవం ఎదురైంది. ఇప్పుడు ఇదే రికార్డును ఈ టోర్నీలోనూ అజేయ భారత్‌ కొనసాగించాలని ఆశిస్తోంది. ప్రస్తుత టోర్నీలో జట్ల బలాబలాల విషయానికి వస్తే యువభారత్‌ ఆల్‌రౌండ్‌ షోతో జైత్రయాత్ర చేస్తోంది. బ్యాటింగ్‌లో కెప్టెన్‌ ఉదయ్‌ సహరణ్‌ (389 పరుగులు), ముషీర్‌ ఖాన్‌ (338), సచిన్‌ దాస్‌ (294) సూపర్‌ ఫామ్‌లో ఉన్నారు.

బౌలింగ్‌లో సౌమీ పాండే (17 వికెట్లు) స్పిన్‌ మాయాజాలం ప్రత్యర్థి బ్యాటర్లను కట్టిపడేస్తోంది. మరోవైపు ఆసీస్‌ తరఫున ఓపెనర్‌ హ్యారీ డిక్సన్‌ (267 పరుగులు), కెప్టెన్‌ హ్యూగ్‌ వేగన్‌ (256) రాణించారు. బౌలింగ్‌లో కలమ్‌ విడ్లెర్‌ (12 వికెట్లు), టాస్‌ స్ట్రేకర్‌ (12 వికెట్లు) ప్రత్యర్థి బ్యాటర్లపై ప్రభావం కనబరిచారు.

విజయాల పరంగా కూడా ఆసీస్‌... భారత్‌ లాగే దీటైన ప్రదర్శన చేసింది. సూపర్‌ సిక్స్‌లో విండీస్‌తో మ్యాచ్‌ వర్షంతో రద్దవగా మిగతా ఐదు మ్యాచ్‌ల్లోనూ గెలిచి అజేయంగా నిలిచింది. ఈ నేపథ్యంలో ఇరుజట్ల మధ్య ఫైనల్‌ హోరాహోరీగా జరిగే అవకాశముంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)