Breaking News

హైదరాబాద్‌లో ధనాధన్‌కు సై

Published on Sat, 10/12/2024 - 02:22

తొలి టి20లో సులువైన విజయం... రెండో టి20లో మరీ ఎదురు లేని ఆధిపత్యం... సిరీస్‌ గెలుచుకున్న తర్వాత ఇక మూడో టి20లో భారత్‌ చేయాల్సిందేముంది...అదే జోరు కొనసాగించి అభిమానులకు మరింత ఆనందం పంచడం... గత రెండు మ్యాచ్‌లు ఆడని ప్లేయర్లకు అవకాశం ఇవ్వడం... బంగ్లాదేశ్‌తో చివరి టి20కి ముందు భారత టీమ్‌ మేనేజ్‌మెంట్‌ ఆలోచన ఇది... 

మరో వైపు బంగ్లాదేశ్‌ పరిస్థితి మరీ పేలవం... టెస్టు సిరీస్‌ను 0–2తో కోల్పోయిన తర్వాత టి20 సిరీస్‌ కూడా చేజారిపోయింది... ఇక మిగిలింది ఏకైక మ్యాచ్‌లో ఎంతో కొంత మెరుగ్గా రాణించి పరువు కాపాడుకోవడం... ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ అభిమానుల కోసం ధనాధన్‌ పోరుకు రంగం సిద్ధమైంది. 

సాక్షి, హైదరాబాద్‌: ఏడాది ఆరంభంలో భారత్, ఇంగ్లండ్‌ మధ్య టెస్టు మ్యాచ్‌ వినోదాన్ని ఆస్వాదించిన నగర అభిమానులకు ఇప్పుడు దసరా రోజున టి20 ఆనందానికి సమయం ఆసన్నమైంది. ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ స్టేడియంలో నేడు భారత్, బంగ్లాదేశ్‌ జట్లు మూడో టి20 మ్యాచ్‌లో తలపడనున్నాయి. 

ఇప్పటికే సిరీస్‌ గెలుచుకున్న సూర్యకుమార్‌ బృందం క్లీన్‌స్వీప్‌పై దృష్టి పెట్టగా...ఒక్క మ్యాచ్‌లోనైనా నెగ్గి స్వదేశం వెళ్లాలని బంగ్లా భావిస్తోంది. అయితే టీమిండియా జోరు చూస్తే జట్టును నిలువరించడం ప్రత్యరి్థకి దాదాపు అసాధ్యం కావచ్చు.  

హర్షిత్‌ రాణాకు చోటు!  
సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లలో అవకాశం దక్కని ఆటగాళ్లు నలుగురు ఉన్నారు. వీరిలో ఇక్కడ ఎవరు ఆడతారనేది ఆసక్తికరం. మయాంక్‌ స్థానంలో మరో కొత్త ఆటగాడు హర్షిత్‌ రాణాను ఎంపిక చేయడం దాదాపు ఖాయంగా అనిపిస్తోంది. 2024 ఐపీఎల్‌లో కోల్‌కతా విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించిన పేసర్‌ హర్షిత్‌కు తొలి అవకాశం ఇవ్వాలని కోచ్‌ గంభీర్‌ భావిస్తున్నాడు. స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి స్థానంలో లెగ్‌స్పిన్నర్‌ రవి బిష్ణోయ్‌ను కూడా ఆడించవచ్చు. 

ప్రస్తుత పరిస్థితిలో కీపర్‌ జితేశ్‌ శర్మకు చాన్స్‌ కష్టమే. అయితే హైదరాబాదీ ఆటగాడు తిలక్‌ వర్మను తుది జట్టులోకి ఎంచుకుంటారా చూడాలి. సామ్సన్, సూర్యకుమార్, రింకూ, పాండ్యా, పరాగ్‌లతో కూడిన బ్యాటింగ్‌ ఆర్డర్‌ మళ్లీ చెలరేగితే భారీ స్కోరు ఖాయం. సన్‌రైజర్స్‌ ప్లేయర్‌ అభిషేక్‌ శర్మకు ఈ మైదానంలో విధ్వంసకర బ్యాటింగ్‌ ప్రదర్శన చూపించిన రికార్డు ఉంది. అతడిని ఆపడం కూడా బంగ్లాకు కష్టమే.  

గెలిపించేదెవరు? 
బంగ్లాదేశ్‌ టి20 టీమ్‌ చాలా కాలంగా వైఫల్యాల్లోనే ఉంది. ఈ సిరీస్‌లో కూడా అది కొనసాగింది. ఏ ఒక్కరిలో కూడా జట్టును గెలిపించే సామర్థ్యం కనిపించడం లేదు. ఆటగాళ్లు మారినా జట్టు పరిస్థితి మారడం లేదు. అంతా సమష్టిగా విఫలమవుతున్నారు. 

ఢిల్లీ మ్యాచ్‌లో బౌలర్లలో పదును లేక భారత్‌ భారీ స్కోరు చేసే అవకాశం కల్పించగా, బ్యాటర్లెవరూ కనీస స్థాయి ప్రదర్శన ఇవ్వలేదు. పర్వేజ్, లిటన్‌ దాస్, కెపె్టన్‌ నజ్ముల్, తౌహీద్‌...ఎవరూ ఆడటం లేదు. ఈ సారి జాకీర్‌ స్థానంలో మహేదీకి అవకాశం దక్కవచ్చు. 

జట్టులో అందరికంటే సీనియర్‌ అయిన మహ్ముదుల్లా ఈ మ్యాచ్‌తో అంతర్జాతీయ టి20లనుంచి రిటైర్‌ అవుతున్నాడు. చివరిదైన తన 141వ మ్యాచ్‌లోనైనా అతను చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్‌ ఆడి జట్టును గెలిపిస్తాడా చూడాలి. మిరాజ్, తస్కీన్, తన్‌జీమ్‌లతో పాటు అనుభవజు్ఞడైన ముస్తఫిజుర్‌ కూడా ప్రభావం చూపలేకపోతున్నాడు.  

తుది జట్ల వివరాలు (అంచనా) 
భారత్‌: సూర్యకుమార్‌ (కెప్టెన్ ), సామ్సన్, అభిషేక్, నితీశ్‌ రెడ్డి, రింకూ, పాండ్యా, పరాగ్‌/ తిలక్, సుందర్, వరుణ్, అర్‌‡్షదీప్, హర్షిత్‌.  
బంగ్లాదేశ్‌: నజు్మల్‌ (కెప్టెన్ ), పర్వేజ్, లిటన్‌దాస్, తౌహీద్, మహ్ముదుల్లా, మిరాజ్, మహేదీ, రిషాద్, తన్‌జీమ్, తస్కీన్, ముస్తఫిజుర్‌.  

పిచ్, వాతావరణం 
ఉప్పల్‌ పిచ్‌ సాధారణంగా బ్యాటింగ్‌కు అనుకూలం. భారీ స్కోర్లు నమోదు కావచ్చు. శుక్రవారం సాయంత్రం ఇక్కడ వర్షం కురిసింది. మ్యాచ్‌ రోజున కూడా వాన పడే అవకాశం ఉంది. అయితే కొద్ది సేపు అంతరాయం మినహా పూర్తిగా మ్యాచ్‌కు ఆటంకం కలగకపోవచ్చు.  

చెలరేగుతారా! 
సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆటగాడిగా నితీశ్‌ రెడ్డి ఇదే మైదానంలో చూపించిన దూకుడు అతనికి భారత జట్టులో చోటు కల్పించింది. ఇప్పుడు టీమిండియా ప్లేయర్‌గా అతను తొలిసారి ఉప్పల్‌ మైదానంలో బరిలోకి దిగబోతున్నాడు. 

ఈ ఆంధ్ర క్రికెటర్‌ బంగ్లాపై గత మ్యాచ్‌లో విధ్వంసం సృష్టించాడు. ఇక్కడా అదే ధాటిని ప్రదర్శించాలని అభిమానులు కోరుకుంటున్నాడు. ఐపీఎల్‌లో ముంబైకి ఆడే మరో హైదరాబాదీ తిలక్‌ వర్మ కూడా సొంతగడ్డపై బరిలోకి దిగాలని ఆశిస్తున్నాడు. వీరిద్దరూ బాగా ఆడితే దసరా రోజు అభిమానులకు పరుగుల పండగే.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)