టీ20 ప్రపంచకప్‌ 2026 హీరోకు ఘోర అవమానం

Published on Thu, 03/12/2026 - 17:18

తాజాగా ముగిసిన టీ20 ప్రపంచకప్‌-2026లో న్యూజిలాండ్‌ను ఫైనల్‌కు చేర్చడంతో పాటు టోర్నీలో సెకెండ్‌ లీడింగ్‌ రన్‌ స్కోరర్‌గా నిలిచిన విధ్వంసకర బ్యాటర్‌ టిమ్‌ సీఫర్ట్‌కు ఘోర అవమానం జరిగింది. ఇవాళ (మార్చి 12) జరుగుతున్న హండ్రెడ్‌ లీగ్‌ 2026 వేలంలో అతన్ని ఏ ఫ్రాంచైజీ తీసుకోలేదు. ఈ వేలంలో టిమ్‌ టైర్‌-1 బ్యాటర్‌గా లక్షల పౌండ్ల బేస్‌ ప్రైజ్‌ విభాగంలో తన పేరు నమోదు చేసుకున్నాడు. సూపర్‌ ఫామ్‌లో ఉన్నా, టిమ్‌పై ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. టిమ్‌ పేరు వేలంలో మరోసారి వచ్చే అవకాశం ఉంది.

టిమ్‌ తాజాగా ముగిసిన టీ20 ప్రపంచకప్‌లో 8 ఇన్నింగ్స్‌ల్లో 166.33 స్ట్రయిక్‌రేట్‌తో 326 పరుగులు చేసి దూకుడు ప్రదర్శించాడు. ఈ టోర్నీలో టిమ్‌వే అత్యధిక హాఫ్‌ సెంచరీలు (4). టిమ్‌ను ఇటీవల జరిగిన ఐపీఎల్‌-2026 వేలంలో కేకేఆర్‌ రూ. 1.5 కోట్లకు సొంతం చేసుకుంది. ఐపీఎల్‌ వేలానికి సరిగ్గా ముందు రోజు టిమ్‌ బిగ్‌బాష్‌ లీగ్‌లో 53 బంతుల్లో సెంచరీ చేశాడు. 

తాజాగా భారత్‌తో జరిగిన టీ20 ప్రపంచకప్‌ ఫైనల్లో మిగతా న్యూజిలాండ్‌ బ్యాటర్లంతా విఫలమైనా టిమ్‌ ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. దీనికి ముందు సౌతాఫ్రికాతో జరిగిన సెమీఫైనల్లోనూ టిమ్‌ అర్ద సెంచరీతో (58) సత్తా చాటాడు. వికెట్‌కీపర్‌ కమ్‌ బ్యాటర్‌ అయిన టిమ్‌ను హండ్రెడ్‌ లీగ్‌లో ఏ ఫ్రాంచైజీ తీసుకోకపోవడం నిజంగా ఆశ్చర్యాన్ని కలిగించే విషయమే.

ఇదిలా ఉంటే, ప్రస్తుతం లండన్‌లో పురుషుల హండ్రెడ్‌ లీగ్‌ వేలం జోరుగా సాగుతోంది. దేశ, విదేశాల ఆటగాళ్ల కోసం ఫ్రాంచైజీలు తీవ్రంగా పోటీపడుతున్నాయి. హండ్రెడ్‌ లీగ్‌ చరిత్రలో వేలం జరగడం ఇదే తొలిసారి. దీనికి ముందు ఆటగాళ్ల ఎంపిక డ్రాఫ్ట్‌ పద్దతిలో జరిగేది. 

నిన్న (మార్చి 11) మహిళల హండ్రెడ్‌ లీగ్‌ వేలం పూర్తైంది. ఈ వేలంలో సోఫీ డివైన్‌, బెత్‌ మూనీ, దీప్తి శర్మ, రిచా ఘోష్‌ లాంటి స్టార్‌ ప్లేయర్లు లాభదాయకమైన కాంట్రాక్టులు పొందారు. అయితే ఈ వేలంలో పాక్‌ ప్లేయర్లకు ఘోర అవమానం ఎదురైంది. ఆ జట్టు ప్లేయర్లపై ఏ ఒక్క ఫ్రాంచైజీ ఆసక్తి కనబర్చలేదు. వారి కెప్టెన్‌ ఫాతిమా సనా కూడా అన్‌ సోల్డ్‌గా మిగిలిపోయింది.

 

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)