Breaking News

AUS Vs SA: టిమ్ డేవిడ్ విధ్వంసం.. దెబ్బ‌కు 16 ఏళ్ల వార్న‌ర్ రికార్డు బ్రేక్‌

Published on Sun, 08/10/2025 - 17:41

డార్విన్ వేదిక‌గా సౌతాఫ్రికాతో జ‌రుగుతున్న తొలి టీ20లో ఆస్ట్రేలియా బ్యాట‌ర్ టిమ్ డేవిడ్ విధ్వంసం సృష్టించాడు. ఐదో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన డేవిడ్ సఫారీ బౌలర్లను ఊతికారేశాడు. మర్రారా క్రికెట్ గ్రౌండ్‌లో బౌండరీల వర్షం కురిపించాడు.

ఒకవైపు క్రమం తప్పకుండా వికెట్లు పడుతున్నప్పటికి.. డేవిడ్ తన బ్యాటింగ్ విధ్వంసాన్ని ఆపలేదు. వచ్చిన బంతిని వచ్చినట్టుగా పెవిలియన్‌కు పంపాడు. మొత్తంగా 52 బంతులు ఎదుర్కొన్న డేవిడ్‌.. 8 సిక్స్‌లు, 4 ఫోర్లతో 83 పరుగులు చేశాడు.

కాగా ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా కెప్టెన్ ఐడైన్ మార్క్‌ర్రమ్ తొలుత ఆసీస్‌ను బ్యాటింగ్‌కు ఆహ్హనించాడు. ఆరంభంలోనే ట్రావిస్ హెడ్‌(2), కెప్టెన్ మిచెల్ మార్ష్‌(13), జోష్ ఇంగ్లిష్(0) వికెట్లను కోల్పోయింది. ఈ క్రమంలో డేవిడ్ గ్రీన్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు.

కానీ కాసేపు మెరుపులు మెరిపించిన గ్రీన్ కూడా పేవిలియన్‌కు చేరాడు. అనంతరం క్రీజులో వచ్చిన మాక్స్‌వెల్ సైతం కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి ఔటయ్యాడు. దీంతో డేవిడ్ టెయిలాండర్ల సాయంతో ప్రత్యర్ధి బౌలర్లపై ఎదరుదాడికి దిగాడు.

అతడి విధ్వంసకర ఇన్నింగ్స్ ఫలితంగా ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 10 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేయగల్గింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో క్వేనా మఫాకా నాలుగు వికెట్లు పడగొట్టగా.. రబాడ రెండు, ఎంగిడీ, లిండే, ముత్తుసామి చెరో వికెట్ సాధించారు.

వార్నర్‌ రికార్డు బ్రేక్‌
ఈ మ్యాచ్‌లో  మెరుపు ఇన్నింగ్స్ ఆడిన డేవిడ్ ఓ అరుదైన రికార్డును త‌న పేరిట లిఖించుకున్నాడు. సౌతాఫ్రికాపై ఓ టీ20 ఇన్నింగ్స్‌లో అత్య‌ధిక సిక్స్‌లు కొట్టిన ఆట‌గాడిగా వార్న‌ర్ రికార్డును డేవిడ్ బ్రేక్ చేశాడు. డేవిడ్ వార్న‌ర్ 2009లో సౌతాఫ్రికాతో జ‌రిగిన టీ20 మ్యాచ్‌లో 6 సిక్స్‌లు బాదాడు. తాజా మ్యాచ్‌లో 8 సిక్సర్లు కొట్టిన డేవిడ్‌.. వార్న‌ర్‌ను అధిగ‌మించాడు.
చదవండి: 'రోహిత్ ఒక మంచి స్పిన్న‌ర్ అవుతాడనుకున్నా.. కానీ ఒక రోజు'
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)