జిడ్డు బ్యాటింగ్ అంటూ విమర్శలు.. కట్ చేస్తే! బౌండరీలతో విధ్వంసం

Published on Sat, 07/25/2026 - 19:15

టీమిండియా సూపర్‌ స్టార్‌ తిలక్‌ వర్మ తన ఫామ్‌పై విమర్శలు చేస్తున్న వారికి బ్యాట్‌తోనే సమాధనమిచ్చాడు. శనివారం హరారే వేదికగా జింబాబ్వేతో రెండో టీ20లో తిలక్ విధ్వసంకర హాఫ్ సెంచరీతో సత్తాచాటాడు. కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్ ఔట‌య్యాక క్రీజులోకి వ‌చ్చిన తిల‌క్.. ప్ర‌త్య‌ర్ధి బౌల‌ర్ల‌పై విరుచుకుప‌డ్డాడు. ఈ హైద‌రాబాదీ మైదానం నలుమూలల బౌండరీలు బాదుతూ అభిమానులను అలరించాడు.

ఈ క్ర‌మంలో తిలక్‌ కేవ‌లం 23 బంతుల్లో త‌న హాఫ్ సెంచ‌రీ మార్క్‌ను అందుకున్నాడు. అతడికి ఇది 9వ టీ20 హాఫ్ సెంచ‌రీ. మొత్తంగా భారత వైస్ కెప్టెన్‌ 29 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 60 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. 

అతడితో పాటు వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ ఇషాన్‌ కిషన్‌ అద్భుత ఇన్నింగ్స్‌ ఆడాడు. 44 బంతుల్లో కిషన్‌ 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 81 పరుగులు చేశాడు. ఫలితంగా టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. కాగా ఇటీవల కాలంలో తిలక్ ఆట తీరుపై చాలా మంది మాజీలు విమర్శలు గుప్పించారు. 

చాలా తక్కువ స్ట్రైక్‌రేట్‌తో ఆడుతున్నాడని, జట్టు నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. వీటిపై స్పందిచిన తిలక్.. మ్యాచ్ పరిస్థితులకు అనుగుణంగానే తన ఆటతీరు ఉంటుందని స్పష్టం చేశాడు. ఇప్పుడు మరోసారి తనలోని హిట్టర్‌ను తిలక్ బయటపెట్టాడు. తనకు దూకుడుగా ఆడడంతో పాటు సమయస్పూర్తితో కూడా ఆడడం తెలుసు అని తిలక్ చాటి చెప్పాడు.
చదవండి: భారత్ త‌ర‌పున అరంగేట్రం.. ఎవ‌రీ య‌శ్ ఠాకూర్‌

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)