అదరగొట్టిన తిలక్‌ వర్మ.. సెంచరీతో సెలెక్టర్లకు వార్నింగ్‌

Published on Sat, 01/03/2026 - 15:32

విజయ్ హజారే ట్రోఫీ 2025-26 సీజన్‌లో హైదరాబాద్ కెప్టెన్‌, టీమిండియా స్టార్ బ్యాటర్‌ తిలక్ వర్మ తను ఆడిన తొలి మ్యాచ్‌లోనే శతక్కొట్టాడు. రాజ్‌కోట్ వేదికగా చండీగఢ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో తిలక్ సూప‌ర్‌ సెంచరీతో చెలరేగాడు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్‌కు ఆరంభంలోనే గట్టి ఎదురు దెబ్బ తగిలింది.

ఓపెనర్లు అమన్ రావ్‌(13), తన్మయ్ అగర్వాల్‌(16) వెంటవెంటనే పెవిలియన్‌కు చేరారు. ఈ క్ర‌మంలో క్రీజులోకి వ‌చ్చిన తిల‌క్ వ‌ర్మ త‌న అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌తో జ‌ట్టును ఆదుకున్నాడు.తొలుత ఆచి తూచి ఆడిన వ‌ర్మ.. క్రీజులో కుదుర్కొన్నాక ప్ర‌త్య‌ర్ధి బౌల‌ర్ల‌పై విరుచుకుప‌డ్డాడు. 

అభిరత్ రెడ్డి (71) తో కలిసి 114 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. మొత్తంగా 118 బంతులు ఎదుర్కొన్న తిలక్‌ వర్మ.. 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 109 పరుగులు చేశాడు. ఫలితంగా హైదరాబాద్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 286 పరుగులు చేసింది. చండీగఢ్‌ బౌలర్లలో జగజీత్ సింగ్‌ మూడు వికెట్లు పడగొట్టగా.. రోహిత్‌ దండా,హర్తేజస్వి కపూర్, విశూ కశ్యప్‌ తలా రెండు వికెట్లు సాధించారు.

కివీస్‌తో వన్డేలకు తిలక్‌కు చోటిస్తారా?
కాగా న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు భారత జట్టును శనివారం బీసీసీఐ సెలక్షన్ కమిటీ ప్రకటించనుంది. అయితే ఈ జట్టులో తిలక్ వర్మకు చోటు దక్కుతుందా లేదా అన్నది ఇంకా స్పష్టత లేదు. సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌లో తిలక్ భారత జట్టులో భాగమైనప్పటికి.. ఇప్పుడు కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌, వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తిరిగి రానుండడంతో అతడిపై వేటు పడే అవకాశముంది.

మ‌రోవైపు క‌ర్ణాట‌క ఆట‌గాడు దేవ్‌ద‌త్త్ ప‌డిక్క‌ల్ కూడా సెంచ‌రీలో మోత మోగిస్తున్నాడు. అత‌డు కూడా సెల‌క్ట‌ర్లు దృష్టిలో ఉన్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా వికెట్ కీపర్ రిషబ్ పంత్‌పై కూడా వేటు వేయనున్నట్లు సమాచారం. అతడి స్ధానంలో ఇషాన్ కిషన్‌ను జట్టులోకి తీసుకోనున్నట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి.
చదవండి: శతక్కొట్టిన హార్దిక్‌ పాండ్యా.. కెరీర్‌లో ‘తొలి’ సెంచరీ!

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)