Breaking News

ఇం‍గ్లండ్‌ గడ్డపై ఇరగదీస్తున్న తిలక్‌ వర్మ.. మరో సూపర్‌ సెంచరీ

Published on Fri, 07/25/2025 - 12:36

ఇంగ్లండ్‌ కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో టీమిం‍డియా యువ ఆటగాడు తిలక్‌ వర్మ తన సూపర్‌ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ మెగా టోర్నమెంట్‌లో హాంప్‌షైర్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న తిలక్‌ వర్మ.. నాటింగ్‌హామ్‌షైర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో తిలక్‌ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. 

నాలుగో డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన తిలక్‌ తన బ్యాటింగ్‌తో ప్రత్యర్ధి బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 256 బంతులు ఎదుర్కొన్న వర్మ.. 13 ఫోర్లు, రెండు సిక్సర్లతో 112 పరుగులు చేశాడు. ఇంగ్లండ్‌ కౌంటీల్లో తొలిసారి ఆడుతున్న నంబూరి ఠాకూర్ తిలక్ వర్మ.. తన అరంగేట్ర మ్యాచ్‌లోనే శతక్కొట్టాడు.

ఈ ఏడాది సీజన్‌లో తిలక్‌కు ఇది రెండో సెంచరీ.  రెడ్‌బాల్‌ క్రికెట్‌లో ఈ హైదరాబాదీ ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే త్వరలోనే భారత టెస్టు జట్టులోకి వచ్చే అవకాశముంది. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో అతడికి మంచి ట్రాక్‌ రికార్డు ఉంది. ఇక ఇప్ప‌టివ‌ర‌కు 18 ఫ‌స్ట్ క్లాస్‌లు మ్యాచ్‌లు ఆడిన తిల‌క్ వ‌ర్మ‌.. 50కి పైగా సగటుతో 1204 పరుగులు చేశాడు. 

ఇందులో ఐదు సెంచరీలు, నాలుగు ఆర్ధ శ‌త‌కాలు ఉన్నాయి.  ప్రస్తుతం ఈ హైద‌రాబాదీ భార‌త జ‌ట్టుకు వైట్-బాల్ స్పెషలిస్టుగా ఉన్నాడు. నాలుగు వన్డేలు, 25 టీ20ల్లో భార‌త్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ముఖ్యంగా  అత‌డికి టీ20ల్లో అద్బుత‌మైన రికార్డు ఉంది. 24 ఇన్నింగ్స్‌లలో 49.93 స‌గ‌టుతో 749 పరుగులు చేశాడు.
చదవండి: IND vs ENG: డీఎస్పీ ఆన్‌ ఫైర్‌.. గొడ‌వ‌లు అవ‌స‌ర‌మా సిరాజ్ భ‌య్యా? వీడియో
 

Videos

రెండు కాళ్లు లేని దివ్యాంగుడిపై దాడి.. టీడీపీ నేతల దాష్టీకం

కివీస్ తో పోరుకు బుల్డోడు అసలు కారణం ఇదే

నీ బెదిరింపులకు ఎవరూ భయపడరు దీప్తి రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఐదు రౌండ్ల కాల్పులు.. టైగర్ ష్రాఫ్ కేసులో కీలక మలుపు..!

నాకు అంత కోపం రావడానికి కారణం.. నామినేషన్ వేసేటప్పుడు అసలు ఏం జరిగిందంటే

లోకల్ వార్ రెండో దశ మొదలు

ఘోర రోడ్డు ప్రమాదం..ఎగిరిబడ్డ వ్యక్తి

YSRCP MPTC అభ్యర్థిపై దాడి పోలీస్ స్టేషన్ కు YS అవినాష్ రెడ్డి

Ramchandrapuram : కూటమిని చిత్తుచిత్తుగా ఓడిస్తాం

నామినేషన్ పత్రాలు చించేసిన TDP గూండాలు అక్కడ ఎన్నిక వాయిదా

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)