కోహ్లి ‘ప్రపంచ రికార్డు’ బ్రేక్‌ చేసిన తిలక్‌ వర్మ

Published on Mon, 12/15/2025 - 12:32

టీమిండియా టీ20 స్టార్‌ తిలక్‌ వర్మ సరికొత్త చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌ ఛేదనలో అత్యుత్తమ సగటుతో పరుగులు సాధించిన క్రికెటర్‌గా నిలిచాడు. తద్వారా ఇన్నాళ్లుగా భారత బ్యాటింగ్‌ దిగ్గజం విరాట్‌ కోహ్లి పేరిట ఉన్న ఈ ప్రపంచ రికార్డును తిలక్‌ బద్దలు కొట్టాడు.

తొలి రెండు టీ20లలో అలా
స్వదేశంలో సౌతాఫ్రికాతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌తో బిజీగా ఉన్నాడు తిలక్‌ వర్మ (Tilak Varma). బ్యాటింగ్‌ ఆర్డర్‌లో తరచూ మార్పుల నేపథ్యంలో కటక్‌ వేదికగా తొలి టీ20లో నాలుగో స్థానంలో వచ్చిన ఈ హైదరాబాదీ 32 బంతుల్లో 26 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో భారత్‌ గెలిచిన విషయం తెలిసిందే.

ఇక ముల్లన్‌పూర్‌లో జరిగిన రెండో టీ20లోనూ ఇదే స్థానంలో ఆడిన ఈ లెఫ్టాండర్‌ బ్యాటర్‌.. ఈసారి మాత్రం దుమ్ములేపాడు. కేవలం 34 బంతుల్లోనే 62 పరుగులు సాధించాడు తిలక్‌. అయితే, ఈ మ్యాచ్‌లో అతడి పోరాటం వృథాగా పోయింది.

అత్యుత్తమ సగటు కలిగిన బ్యాటర్‌
తాజాగా ఆదివారం నాటి మూడో టీ20లో మాత్రం తిలక్‌ తనదైన మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. ధర్మశాలలో మూడో టీ20లో సౌతాఫ్రికా విధించిన 118 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనను టీమిండియా 15.5 ఓవర్లలోనే పూర్తి చేసింది.

ఈ మ్యాచ్‌లో తిలక్‌ వర్మ 34 బంతుల్లో మూడు ఫోర్ల సాయంతో 25 పరుగులతో అజేయంగా నిలిచాడు. జట్టు గెలుపులో తన వంతు పాత్ర పోషించాడు. ఈ క్రమంలోనే తిలక్‌ వర్మ అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ టీ20 లక్ష్య ఛేదనలో.. కనీసం 500 పరుగులు సాధించిన ఆటగాళ్ల (టెస్టు హోదా కలిగిన దేశాలు) జాబితాలో అత్యుత్తమ సగటు కలిగిన బ్యాటర్‌గా నిలిచాడు.

అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్లో లక్ష్య ఛేదనలో అత్యుత్తమ సగటు కలిగిన బ్యాటర్లు (కనీసం 500 పరుగులు)
🏏తిలక్‌ వర్మ (ఇండియా)- 68.0 సగటుతో
🏏విరాట్‌ కోహ్లి (ఇండియా)- 67.1 సగటుతో
🏏ఎంఎస్‌ ధోని (ఇండియా)- 47.71 సగటుతో
🏏జేపీ డుమిని (సౌతాఫ్రికా)- 45.55 సగటుతో
🏏సంగక్కర (శ్రీలంక)- 44.93 సగటుతో.

చదవండి: ‘గోట్‌ టూర్‌’ చీఫ్‌ ఆర్గనైజర్‌ జైలుకు!

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)