బీసీసీఐ కొత్త అవార్డు.. తొలి క్రికెటర్‌గా తిలక్‌ వర్మ రికార్డు

Published on Sat, 07/25/2026 - 08:00

జింబాబ్వేతో జ‌రుగుతున్న టీ20 సిరీస్‌లో భాగంగా తొలి టీ20లో విజ‌యం ద్వారా టీమిండియా వ‌రుస ఓట‌ముల‌కు చెక్ పెట్టింది. ప్ర‌త్య‌ర్థిని త‌క్కువ స్కోరుకే క‌ట్ట‌డి చేసిన భార‌త్ ఆ త‌ర్వాత వైభ‌వ్ విధ్వంసంతో సునాయాసంగా ల‌క్ష్యాన్ని అందుకుంది. ఇవాళ హ‌రారే వేదిక‌గా రెండో టీ20 మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి మ‌రో మ్యాచ్ మిగిలి ఉండ‌గానే సిరీస్‌ను ఒడిసిప‌ట్టాల‌ని చూస్తోంది. ఇదిలా ఉంటే, జింబాబ్వే సిరీస్‌కు హెడ్‌కోచ్ గంభీర్‌కు విశ్రాంతినిచ్చిన సంగ‌తి తెలిసిందే. 

అత‌డి స్థానంలో మాజీ క్రికెట‌ర్ వీవీఎస్ ల‌క్ష్మ‌ణ్‌ను మెంటార్‌గా జ‌ట్టుతో పంపించారు. తొలి టీ20లో విజ‌యం త‌ర్వాత వీవీఎస్ ల‌క్ష్మ‌ణ్ డ్రెస్సింగ్ రూమ్‌లో విన్నింగ్ సందేశాన్ని ఇచ్చాడు. ఈ క్ర‌మంలో మైదానంలో అత్యుత్త‌మ ప్ర‌దర్శ‌న క‌న‌బ‌రిచిన ఆట‌గాళ్ల‌కు డ్రెస్సింగ్ రూమ్‌లో అవార్డులు ఇవ్వ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది. 


Photo Credit: BCCI Twitter

అయితే బీసీసీఐ ఇటీవ‌ల ‘బెస్ట్ యాటిట్యూడ్ ఆఫ్ ది మ్యాచ్‌’ అవార్డు ప్ర‌వేశ‌పెట్టింది. తాజాగా ఈ అవార్డును తిల‌క్ వ‌ర్మ అందుకున్నాడు. తిల‌క్‌వ‌ర్మకు అవార్డు ఇవ్వ‌డంపై ల‌క్ష్మ‌ణ్ వివ‌ర‌ణ ఇచ్చాడు. ‘గ్రౌండ్‌తో పాటు మైదానం వెలుప‌ల కూడా త‌న నైపుణ్యంతో అద్భుత వైఖ‌రి ప్ర‌ద‌ర్శించినందుకు తిల‌క్ వ‌ర్మ‌కు ఈ అవార్డు ఇస్తున్న‌ట్లు’ ల‌క్ష్మ‌ణ్ తెలిపాడు. ఈ నేప‌థ్యంలో బెస్ట్ యాటిట్యూడ్ అవార్డు అందుకున్న తొలి భార‌త క్రికెట‌ర్‌గా తిల‌క్ వ‌ర్మ నిలిచాడు. 

తిల‌క్ వ‌ర్మ మాట్లాడుతూ.. ‘జట్టుకు నా నుండి ఏమి అవసరమో అది చేయడానికి నేను ఎల్లప్పుడూ ప్రయత్నిస్తాను, దానికోసం నా వంతు ఉత్తమ ప్రదర్శన ఇస్తాను. మ‌రో విషయ‌మేమిటంటే, నేను మైదానం వెలుపల చేసే కఠోర శ్రమ మైదానంలో నన్ను మరింత మెరుగ్గా ఆడేలా చేస్తుంది. ఈ అవార్డు ఇచ్చినందుకు కృత‌జ్ఞ‌త‌లు’ అని తిల‌క్ తెలిపాడు. దీనికి సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైరల్‌గా మారింది.
 

Read: కాంస్యంతో మెరిసిన ‘రిక్షావోడు’ .. కామన్‌వెల్త్‌లో భారత్‌ బోణీ

Videos

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)