Breaking News

అంపైర్లతో తిలక్‌ వర్మ, వైభవ్‌ వాగ్వాదం.. తిలక్‌ను తోసేసి..

Published on Mon, 06/15/2026 - 20:12

భారత్‌- ‘ఎ’ జట్టు కెప్టెన్‌ తిలక్‌ వర్మ, యువ ఆటగాడు వైభవ్‌ సూర్యవంశీ అంపైర్లతో తీవ్ర స్థాయిలో వాగ్వాదానికి దిగారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి. కాగా శ్రీలంక వేదికగా ముక్కోణపు వన్డే సిరీస్‌లో భారత్‌- ‘ఎ’ జట్టుకు వరుసగా రెండో పరాజయం ఎదురైంది.

దంబుల్లా వేదికగా గురువారం అఫ్గనిస్తాన్‌- ‘ఎ’ జట్టు చేతిలో ఓడిన భారత్‌.. సోమవారం శ్రీలంక చేతిలోనూ ఓటమి పాలైంది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 49.2 ఓవర్లలో 265 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో సరిగ్గా 265 పరుగులు చేయడంతో మ్యాచ్‌ ‘టై’ అయింది.

అయితే, శ్రీలంక ఇన్నింగ్స్‌లో ఆఖరి బంతిని ఎదుర్కొన్న గుణశేఖర బాల్‌ను ఫ్లిక్‌ చేయకుండానే.. సింగిల్‌ తీసి రనౌట్‌ అయ్యాడు. దీంతో స్కోరు సమం కాగా.. భారత శిబిరం మాత్రం ఆ పరుగును ఎలా పరిగణిస్తారని అంపైర్లను ప్రశ్నించింది. మరోవైపు.. సూపర్‌ ఓవర్‌ నిర్వహించాల్సి ఉండగా అప్పటికే చీకటి పడిపోయింది.

ఈ నేపథ్యంలో కెప్టెన్‌ తిలక్‌ వర్మ అంపైర్లతో వాగ్వాదానికి దిగాడు. గుణశేఖర బంతిని బాదనపుడు తొలి పరుగును ఎలా లెక్కలోకి తీసుకుంటారని వాదించినట్లు కనిపించింది. ఆ సమయంలో వైభవ్‌ సూర్యవంశీ కూడా తిలక్‌కు మద్దతుగా వచ్చి నిలబడ్డాడు.

అయితే, కాసేటికే తిలక్‌ను సముదాయించినట్లు వెనక్కి నెడుతూ అక్కడి నుంచి తీసుకెళ్లాడు. ఇక సూపర్‌ ఓవర్లో తిలక్‌ బంతిని అర్షద్‌ ఖాన్‌కు ఇవ్వగా.. లంక కెప్టెన్‌ సహన్‌ అరాచిగే తొలి బంతికే రెండు పరుగులు రాబట్టాడు. రెండో బంతి వైడ్‌కాగా.. తదుపరి మరో సింగిల్‌ వచ్చింది.

మూడో బంతికి అవిష్క ఫెర్నాండో సింగిల్‌ తీయగా.. నాలుగో బంతికి అరాచిగే మూడు పరుగులు రాబట్టాడు. ఐదో బంతిని ఫెర్నాండో సిక్సర్‌గా మలచగా.. ఆరో బంతి నోబాల్‌ అయింది. దీంతో ఫ్రీ హిట్‌ రాగా.. మొత్తంగా లంక 16 పరుగులు చేసింది. అయితే, నోబాల్‌ విషయంలో కూడా తిలక్‌ వర్మ వాదనకు దిగాడు. అనంతరం భారత్‌ తరఫున వైభవ్‌ సూర్యవంశీ, సూర్యాంశ్‌ షెడ్గే బ్యాటింగ్‌కు దిగగా.. భారత్‌కు ఓటమే ఎదురైంది. 

చదవండి: శ్రీలంక ప్లేయర్‌ను నెట్టేసిన వైభవ్‌.. వీడియో వైరల్‌

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)