Breaking News

భారత్‌ ఆడే సిడ్నీ మ్యాచ్‌ టికెట్లు ‘సోల్డ్‌ అవుట్‌’

Published on Fri, 06/27/2025 - 03:55

మెల్‌బోర్న్‌: టీమిండియా ప్రస్తుతం ఇంగ్లండ్‌ పర్యటనలో సంప్రదాయ టెస్టు ఫార్మాట్‌ ఆడుతోంది. ఇది ఐదు టెస్టుల సుదీర్ఘ సిరీస్‌ కావడంతో ఇంగ్లండ్‌ పర్యటన ముగిసేందుకే చాలా సమయం పడుతోంది. ఆగస్టు 4 వరకు అఖరి టెస్టు జరుగుతుంది. అనంతరం బంగ్లాదేశ్‌ పర్యటన ఉంది. ఆ తర్వాతే ఆ్రస్టేలియాలో భారత్‌ పర్యటిస్తుంది. అక్టోబర్‌–నవంబర్‌లలో జరిగే ఈ పరిమిత ఓవర్ల సిరీస్‌లకు ఇంకా నాలుగు నెలల సమయం ఉంది. అయినా సరే భారత్‌ క్రికెట్‌ క్రేజ్‌ను ఆస్ట్రేలియా కూడా సొమ్ము చేసుకుంది. 

మూడు వన్డేలు, ఐదు టి20ల కోసం క్రికెట్‌ ఆ్రస్టేలియా (సీఏ) టికెట్ల విక్రయం చేపట్టగా ఏకంగా 90 వేల పైచిలుకు టికెట్లు హాట్‌ కేకుల్లా అమ్ముడయినట్లు స్వయంగా సీఏ వర్గాలే వెల్లడించాయి. సిడ్నీలో జరిగే మూడో వన్డే, కాన్‌బెర్రాలో జరిగే తొలి టి20 టికెట్లయితే ఒక్కటి కూడా మిగలకుండా ‘సోల్డ్‌ అవుట్‌’ కావడం విశేషం. ‘భారత్, ఆసీస్‌ల మధ్య జరగబోయే పరిమిత ఓవర్ల సిరీస్‌ల కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టికెట్లు హాట్‌కేకుల్లా అమ్ముడవుతున్నాయి. 

ముఖ్యంగా ‘కంగారూ’ దేశంలో స్థిరపడిన భారత సంతతి ప్రేక్షకులు వేలంవెర్రిగా ఎగబడ్డారు’ అని సీఏ ఒక ప్రకటనలో తెలిపింది. సిడ్నీ క్రికెట్‌ గ్రౌండ్‌ (మూడో వన్డే వేదిక), మనుక ఓవల్‌ (కాన్‌బెర్రా–తొలి టి20 వేదిక)లలో జరిగే మ్యాచ్‌ టికెట్లకు అనూహ్య డిమాండ్‌ నెలకొనడంతో నాలుగు నెలల ముందే టికెట్లన్నీ అయిపోయాయని సీఏ పేర్కొంది. భారత సంతతి అభిమానులు కొందరు వందలు, వేల సంఖ్యలో టికెట్లు కొనుగోలు చేసినట్లు తెలిసింది.   

Videos

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)