Breaking News

IND Vs ENG: టీమిండియాకు హార్ట్ బ్రేక్.. ఒక్క వికెట్ తేడాతో ఓట‌మి

Published on Tue, 07/01/2025 - 08:15

నార్తాంప్టన్ వేదిక‌గా సోమ‌వారం ఇంగ్లండ్ అండ‌ర్‌-19 జ‌ట్టుతో జ‌రిగిన రెండో యూత్ వ‌న్డేలో ఒక్క వికెట్ తేడాతో భార‌త్ అండ‌ర్‌-19 జ‌ట్టు ఓట‌మి పాలైంది. దీంతో ఐదు వ‌న్డేల సిరీస్ 1-1 స‌మ‌మైంది. భార‌త్ నిర్ధేశించిన 291 ప‌రుగుల భారీ ల‌క్ష్యాన్ని ఇంగ్లండ్ 49.3 ఓవ‌ర్ల‌లో 9 వికెట్లు కోల్పోయి చేధించింది.

ల‌క్ష్య చేధ‌న‌లో ఇంగ్లండ్ యువ జ‌ట్టు టాప్ ఆర్డర్ బ్యాట‌ర్లు త‌డ‌బ‌డ్డారు. దీంతో ఓ ద‌శ‌లో టీమిండియా సునాయ‌సంగా గెలుస్తుంద‌ని అంతా భావించారు. కానీ ఇంగ్లీష్ జ‌ట్టు వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ థామస్ రెవ్ అద్భుతమైన సెంచరీతో భార‌త్ నుంచి మ్యాచ్ లాగేసుకున్నాడు.

ఓ వైపు క్ర‌మం త‌ప్ప‌కుండా వికెట్లు ప‌డ‌తున్న‌ప్ప‌టికి రెవ్ మాత్రం విరోచిత పోరాటం చేశాడు. 83 బంతుల్లో 16 ఫోర్లు, 6 సిక్స్‌ల‌తో 131 ప‌రుగులు చేశాడు. అత‌డితో పాటు సెబాస్టియన్ మోర్గాన్నాట్(20), అలెక్స్ గ్రీన్‌(12) ఆఖ‌రిలో కీల‌క ఇన్నింగ్స్‌లు ఆడారు. భార‌త బౌల‌ర్ల‌లో ఆర్ఎస్ అంబరీష్ నాలుగు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. యుధాజిత్ గుహ, హెనిల్ పటేల్ త‌లా రెండు వికెట్లు సాధించారు.

వైభ‌వ్ మెరుపులు..
అంత‌కుముందు బ్యాటింగ్ చేసిన టీమిండియా 49 ఓవ‌ర్ల‌లో 290 ప‌రుగుల‌కు ఆలౌటైంది. భార‌త బ్యాట‌ర్ల‌లో యువ సంచ‌ల‌నం వైభ‌వ్ సూర్య‌వంశీ మ‌రోసారి మెరుపులు మెరిపించాడు. 34 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 45 ప‌రుగులు చేసి ఔట‌య్యాడు.

అత‌డితో పాటు విహాన్ మల్హోత్రా(49), రాహుల్ కుమార్‌(47), క‌న్షిక్ చౌహ‌న్‌(45) రాణించారు. ఇంగ్లండ్ బౌల‌ర్ల‌లో ఫ్రెంచ్ నాలుగు.. హోమ్‌, గ్రీన్ త‌లా మూడు వికెట్లు ప‌డ‌గొట్టారు. ఇరు జ‌ట్ల మ‌ధ్య మూడో వ‌న్డే ఇదే వేదిక‌లో జ‌ర‌గ‌నుంది.
చదవండి: బుమ్రాపై నిర్ణ‌యం అప్పుడే.. మా దృష్టింతా దానిపైనే: టీమిండియా కోచ్‌

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)