ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం
Breaking News
RRR vs AKA: మికిల్ స్టన్నింగ్ క్యాచ్ చూశారా?
Published on Sat, 07/04/2026 - 15:49
తెలంగాణ టీ20 (టీజీ20) లీగ్-2026 టోర్నీలో భాగంగా శనివారం నాటి మధ్యాహ్నం మ్యాచ్లో రంగారెడ్డి రైజర్స్- ఖమ్మం ఏసెస్ తలపడుతున్నాయి. ఉప్పల్లో టాస్ గెలిచిన రంగారెడ్డి తొలుత బ్యాటింగ్కు దిగింది. ఓపెనర్లు ఆరోన్ జార్జ్ (4), అరవెల్లి అవినాశ్ రావు (12) విఫలం కాగా.. జ్ఞానప్రకాశ్ రెడ్డి (36), ఆదిత్య జవ్వాజి (43) జట్టును ఆదుకున్నారు.
మిగిలిన వారిలో రాఘవ (2) పూర్తిగా విఫలం కాగా.. కెప్టెన్ తనయ్ త్యాగరాజన్ (14), నితిన్ సాయి యాదవ్ (19)కూడా నిరాశపరిచారు. సచేత్ బింజ్రాజ్క (2), ఆర్యన్ కరియప్ప (2) ఇలా వచ్చి అలా వెళ్లారు. అరుణ్ కుమార్ 1, తనయ్ జడ్డు ఏడు పరుగులతో అజేయంగా నిలిచారు.
ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో రంగారెడ్డి తొమ్మిది వికెట్ల నష్టానికి 147 పరుగులు సాధించింది. ఖమ్మం బౌలర్లలో కెప్టెన్ మిలింద్మూడు వికెట్లతో చెలరేగగా.. హర్షిత్ సాయి, వేద్ రెడ్డి చెరో రెండు వికెట్లు తీశారు. విద్యానంద రెడ్డి, షేక్ అజర్ తలా ఒక వికెట్ దక్కించుకున్నారు.
మికిల్ జైస్వాల్ కళ్లు చెదిరే క్యాచ్
ఇక ఈ మ్యాచ్లో ఖమ్మం స్టార్ మికిల్ జైస్వాల్ కళ్లు చెదిరే క్యాచ్ అందుకున్నాడు. హర్షిత్ సాయి బౌలింగ్లో నితిన్సాయి యాదవ్ ఇచ్చిన క్యాచ్ బౌండరీ లైన్ వద్ద గాల్లోకి ఎగిరి ఒంటిచేత్తో అందుకున్న మికిల్.. బ్యాలెన్స్ కోల్పోకుండా పని పూర్తి చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
YOU CANNOT DO THAT, MICKIL! 🤯🤯
Mickil Jasiwal, you absolute beauty! 🔥
There have been some top grabs this tournament, but none better than Mickil's one-handed STUNNER! 💥#AKAvRRR #SreenidhiUniversityTG20 #ManaCricketShuru pic.twitter.com/b3daQhuKbv— tg20official (@tg20official) July 4, 2026
తుదిజట్లు
ఖమ్మం ఏసెస్
సీవీ మిలింద్ (కెప్టెన్), ప్రతీక్ రెడ్డి (వికెట్ కీపర్), హిమతేజ కొడిమెల, మికిల్ జైస్వాల్, హర్షిత్ సాయి, వాఫీ కచ్చి, జీఎస్కే రెడ్డి, సహేంద్ర మల్లు, షేక్ అజర్, వేద్ రెడ్డి అమిస్తాపురం, విద్యానంద రెడ్డి ఎల్లాల.
రంగారెడ్డి రైజర్స్
తనయ్ త్యాగరాజన్, ఆరోన్ జార్జ్ వర్గీస్, అరవెల్లి అవినాశ్ రావు (వికెట్ కీపర్), రాఘవ, జ్ఞానప్రకాశ్ రెడ్డి, ఆదిత్య జవ్వాజి, నితిన్ సాయి యాదవ్, సచేత్ బింజ్రాజ్క, అరుణ్ కుమార్, ఆర్యన్ కరియప్ప.
Tags : 1