Breaking News

నిన్ను నాశనం చేస్తా: తీవ్ర స్థాయిలో మండిపడ్డ భజ్జీ

Published on Fri, 02/13/2026 - 16:25

టీమిండియా దిగ్గజ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌కు కోపమొచ్చింది. ఇంకోసారి ఇలాగే వాగితే సర్వనాశనం చేస్తా అంటూ పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్‌ తన్వీర్‌ అహ్మద్‌పై భజ్జీ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు. కాగా రిటైర్మెంట్‌ ప్రకటించిన తర్వాత భజ్జీ క్రీడా విశ్లేషకుడిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.

పాక్‌ క్రికెటర్ల వెంటపడతాడు
ఈ క్రమంలో ఇటీవల యూఏఈ వేదికగా ILT20 లీగ్‌లో భజ్జీ బ్రాడ్‌కాస్టర్‌గా వ్యవహరించాడు. ఇందులో భాగంగా పాకిస్తాన్‌ వివాదాస్పద స్పిన్నర్‌ ఉస్మాన్‌ తారిఖ్‌ (Usman Tariq)ను ఇంటర్వ్యూ చేశాడు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ తన్వీర్‌ అహ్మద్‌ అనే ఓ పాక్‌ మాజీ ఆటగాడు భజ్జీపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. పాకిస్తాన్‌ క్రికెటర్లతో తిరుగుతూ ఉంటేనే నీకు గుర్తింపు అన్నట్లుగా ఓవరాక్షన్‌ చేశాడు.

ఈ నేపథ్యంలో భజ్జీ ఘాటుగా స్పందించాడు. తన యూట్యూబ్‌ చానెల్‌ వేదికగా.. ‘‘ఈ వీడియో ఓ తుచ్ఛ మానవుడి గురించి. అతడు నా గురించి ఏవేవో మాట్లాడుతున్నాడు. అతడి పేరేంటో కూడా నాకు తెలియదు. ఎందుకంటే నేను అతడిని ఇంత వరకు ఒక్కసారి కూడా చూడనేలేదు.

ఇమ్రాన్‌ ఖాన్‌, వసీం అక్రంలా బిల్డప్‌
ఇలాంటి వ్యక్తి తనకంటూ గుర్తింపు సంపాదించుకునే క్రమంలో వివిధ ప్లాట్‌ఫామ్‌లలో డ్రామా చేస్తూ ఉంటాడు. నాకైతే ఆ వ్యక్తి గురించి ఏమాత్రం తెలియదు. మీలో ఎవరికైనా తెలిసి ఉంటే చెప్పండి. అతడి పేరు తన్వీర్‌ అహ్మద్‌ అట.

పాకిస్తాన్‌ తరఫున అతడు 3-4 మ్యాచ్‌లు ఆడి ఉంటాడు. కానీ తానేదో ఇమ్రాన్‌ ఖాన్‌, వసీం అక్రమ్‌, వకార్‌ యూనిస్‌ అన్నట్లుగా బిల్డప్‌లు ఇస్తూ ఉంటాడు. ఓ బ్రాడ్‌కాస్టర్‌గా ILT20 టోర్నీలో నా పని నేను పూర్తి చేశాను. మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకున్న ఉస్మాన్‌ తారిఖ్‌ను ప్రశ్నలు అడిగాను.

ఆ మ్యాచ్‌లో అతడు మూడు వికెట్లు తీసి తన జట్టును గెలిపించుకున్నాడు. ఓ బ్రాడ్‌కాస్టర్‌గా నేను అతడిని ప్రశ్నలు అడగాల్సి ఉంటుంది. కానీ ఈ వ్యక్తి (తన్వీర్‌)కి ఇదే సమస్యగా మారిందట. పాకిస్తానీ క్రికెటర్‌ కనిపిస్తే చాలు వారి వెంట నేను తిరుగుతానట.

దిగజారుడు చానెళ్లలో దిగజారుడు వ్యాఖ్యలు
చెవులు రిక్కించుకుని విను. నువ్వెవరో కూడా నాకు తెలియదు. పాకిస్తాన్‌ నుంచి వచ్చిన దిగ్గజ క్రికెటర్లు ఎవరూ కూడా నీలాగా నోరు పారేసుకోలేదు. వాళ్లు తమకంటూ ‍ప్రత్యేక గౌరవాన్ని సంపాదించుకున్నారు. కానీ నీలాంటి వాళ్లు.. జీవితంలో ఏదీ సాధించకపోయినా ఓ చోట కూర్చుని దిగజారుడు చానెళ్లలో దిగజారుడు వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు.

నిన్ను నాశనం చేస్తా. . జాగ్రత్త
ఇప్పటికైనా మాట్లాడే విధానం తెలుసుకో. ఐదు మ్యాచ్‌లు ఆడిన వాడికి 100 మ్యాచ్‌లు ఆడిన వాడికి తేడా ఉంటుంది. కాబట్టి తన్వీర్‌ అహ్మద్‌ నీ స్థాయి ఏమిటో తెలుసుకో. మరోసారి ఇలాగే వాగావు అంటే నిన్ను నాశనం చేస్తా. జాగ్రత్త’’ అంటూ భజ్జీ ఫైర్‌ అయ్యాడు.

కాగా టీమిండియా తరఫున హర్భజన్‌ సింగ్‌ 1998- 2016 మధ్య 103 టెస్టులు, 236 వన్డేలు, 28 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఈ రైటార్మ్‌ ఆఫ్‌ బ్రేక్‌ స్పిన్నర్‌ ఖాతాలో 417 టెస్టు వికెట్లు, 269 వన్డే వికెట్లు, 25 టీ20 వికెట్లు ఉన్నాయి.

మరోవైపు.. రైటార్మ్‌ ఫాస్ట్‌ మీడియం పేసర్‌ తన్వీర్‌ అహ్మద్‌ పాక్‌ తరఫున 5 టెస్టులు, 2 వన్డేలు, ఒక టీ20 ఆడాడు. ఆయా ఫార్మాట్లలో 17, 2, ఒక వికెట్‌ తీశాడు.

చదవండి: IND vs PAK: 'ఈజీగా ఔట్ చేయ‌వ‌చ్చు'.. అభిషేక్‌ను ఎగతాళి చేసిన పాక్ మాజీ ఆట‌గాడు

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)