Breaking News

టీమిండియా అసిస్టెంట్‌ కోచ్‌ రాజీనామా..!

Published on Tue, 07/14/2026 - 18:04

టీమిండియా సహాయ కోచ్ ర్యాన్ టెన్ డష్కటే రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. బీసీసీఐతో పాటు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ అంగీకారం లభిస్తే, ఇంగ్లండ్‌తో మూడో వన్డే అనంతరం ఆయన భారత జట్టుకు వీడ్కోలు చెప్పే అవకాశం ఉంది.

క్రిక్‌బజ్‌ అందించిన సమాచారం ప్రకారం, డష్కటే ఇప్పటికే తన నిర్ణయాన్ని బీసీసీఐకి తెలియజేశాడు. వ్యక్తిగత కారణాల చేత ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. లండన్‌లో నివసిస్తున్న తన కుటుంబంతో ఎక్కువ సమయం గడిపేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాడు.

నెదర్లాండ్స్ మాజీ ఆల్‌రౌండర్ అయిన డష్కటే రెండేళ్ల క్రితం భారత జట్టు సహాయ కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు. ఆయన ఒప్పందం ఈ నెలతో ముస్తుంది. అందుకే ఇంగ్లండ్ పర్యటన పూర్తయ్యాక విధుల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

గంభీర్ అంగీకరిస్తాడా..?
డష్కటేను భారత జట్టు కోచింగ్ సిబ్బందిలోకి తీసుకురావడంలో గౌతమ్ గంభీర్ కీలక పాత్ర పోషించాడు. ఇద్దరి మధ్య మంచి వ్యక్తిగత, వృత్తిపరమైన అనుబంధం ఉంది. దీంతో ఆయన రాజీనామాను గంభీర్ అంగీకరిస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.

ప్రస్తుతం భారత జట్టు ఆశించిన ఫలితాలు సాధించలేకపోతున్న నేపథ్యంలో, డష్కటే కొనసాగాలని గంభీర్ కోరే అవకాశం కూడా ఉంది.

మరోపక్క ఫీల్డింగ్ కోచ్ టీ దిలీప్ కూడా జట్టును వీడుతున్నారన్న వార్తల్లో నిజం లేదని తెలుస్తోంది. రాహుల్ ద్రవిడ్ హయాంలో నియమితులైన దిలీప్ భారత జట్టుతోనే కొనసాగనున్నారని సమాచారం.
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)