Breaking News

త్వరలో మరో క్రికెట్‌ లీగ్‌

Published on Wed, 11/05/2025 - 11:49

సాక్షి, హైదరాబాద్‌: రెండు తెలుగు రాష్ట్రాల్లో 60 వేదికల్లో 600 జట్లతో తెలుగు ప్రీమియర్‌ లీగ్‌ (టీపీఎల్‌) క్రికెట్‌  టోర్నీకి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ లీగ్‌కు సంబంధించిన పోస్టర్‌ను తెలంగాణ క్రీడల మంత్రి వాకిటి శ్రీహరి ఆవిష్కరించారు. టీపీఎల్‌ నిర్వాహకులైన జూపర్‌ ఎల్‌ఈడీ సంస్థ ప్రతినిధులు మంగళవారం మంత్రిని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి లీగ్‌ విశేషాలను వివరించారు. 

యువతను మాదక ద్రవ్యాలకు బానిస కాకుండా క్రమశిక్షణ గల క్రీడాకారులుగా, బాధ్యయుత పౌరుడిగా తయారు చేసే శక్తి క్రీడలకు ఉందని శ్రీహరి అన్నారు. క్రికెట్‌తో పాటు ఏదో ఒక క్రీడలో యువత రాణించాలని, తద్వారా ఆరోగ్యంతో పాటు క్రమశిక్షణ కూడా అలవడుతుందని చెప్పారు. 

‘సే నో టూ’ డ్రగ్స్‌ ప్రచారాన్ని యువతలోకి తీసుకెళ్లేందుకు నిర్వహిస్తున్న ఈ టీపీఎల్‌ విజయవంతం కావాలని ఆకాంక్షించారు. అనంతరం లీగ్‌ నిర్వాహక సంస్థ జూపర్‌ ఎల్‌ఈడీ డైరెక్టర్‌ ఒ.రమేశ్‌ మాట్లాడుతూ తమ సీఎస్‌ఆర్‌ నిధులతో ఈ పోటీలను నిర్వహిస్తోందని తెలిపారు. 

ఈ లీగ్‌ను కేవలం వినోదం కోసం నిర్వహించకుండా సమాజంలో ఆరోగ్య భద్రత, ఫిట్‌నెస్, క్రీడలపై అవగాహన పెంచేందుకు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ టోర్నీ మొత్తం ప్రైజ్‌మనీ రూ. 80 లక్షలు అని ఆయన చెప్పారు.    

చదవండి: ప్రపంచ క్రికెట్‌ను శాశించేందుకు మరో వసంతంలోకి అడుగుపెట్టిన కోహ్లి

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)