ప్రపంచకప్‌లో సంచలనం​, ఆంధ్ర ఆటగాడి విధ్వంసకర శతకం.. విండీస్‌కు ఘోర పరాభవం

Published on Tue, 06/27/2023 - 07:17

వరల్డ్‌కప్‌ క్వాలిఫయర్స్‌లో మరో పెను సంచనలం నమోదైంది. రెండుసార్లు వరల్డ్‌ ఛాంపియన్‌ వెస్టిండీస్‌ను పసికూన నెదర్లాండ్స్‌ సూపర్‌ ఓవర్‌లో మట్టికరిపించింది. ఈ టోర్నీలో తొలుత తమ కంటే చిన్న జట్టైన జింబాబ్వే చేతిలో చావుదెబ్బ తిన్న విండీస్‌.. నిన్న (జూన్‌ 26) జరిగిన మ్యాచ్‌లో అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్న డచ్‌ జట్టు చేతిలో ఘోర పరాభవం ఎదుర్కొంది.

విండీస్‌ నిర్ధేశించిన 375 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో తొలుత నెదర్లాండ్స్‌ను ఆంధ్ర (విజయవాడ) ఆటగాడు  తేజ నిడమనూరు తన విధ్వంసకర శతకంతో (76 బంతుల్లో 111; 11 ఫోర్లు, 3 సిక్సర్లు) గట్టెక్కించగా (స్కోర్లు సమం చేసేంత వరకు తీసుకెళ్లాడు), అనంతరం సూపర్‌ ఓవర్‌లో లోగన్‌ వాన్‌ బీక్‌ సెన్సేషనల్‌ ఇన్నింగ్స్ (4,6,4,6,6,4)‌ ఆడి తన జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.

శతక్కొట్టిన పూరన్‌.. రాణించిన బ్రాండన్‌ కింగ్‌, జాన్సన్‌ ఛార్లెస్‌
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన విండీస్‌.. పూరన్‌ (65 బంతుల్లో 104 నాటౌట్‌; 9 ఫోర్లు, 6 సిక్సర్లు) విధ్వంసకర శతకంతో విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 374 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. విండీస్‌ ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు బ్రాండన్‌ కింగ్‌ (76), జాన్సన్‌ ఛార్లెస్‌ (54) అర్ధసెంచరీలతో రాణించారు.

తేజ నిడమనూరు వీరోచిత శతకం..
అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన నెదర్లాండ్స్‌.. తేజ నిడమనూరు వీరోచిత శతకంతో విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లు ముగిసే సమయానికి స్కోర్‌ను సమం (374/9) చేయగలిగింది. తేజకు కెప్టెన్‌ స్కాట్‌ ఎడ్వర్డ్స్‌ (47 బంతుల్లో 67; 6 ఫోర్లు, సిక్స్‌) సహకరించాడు. దీంతో సూపర్‌ ఓవర్‌ అనివార్యమైంది.

సూపర్‌ ఓవర్‌లో లోగన్‌ వాన్‌ బీక్‌ ఊచకోత.. బంతితోనూ మ్యాజిక్‌
సూపర్‌ ఓవర్‌లో నెదర్లాండ్స్‌ ఆటగాడు లోగన్‌ వాన్‌ బీక్ ఊచకోత కోశాడు. జేసన్‌ హోల్డర్‌ వేసిన ఆ ఓవర్‌లో వాన్‌ బీక్‌ వరుసగా 4,6,4,6,6,4 బాదాడు. అనంతరం 31 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో విండీస్‌ చేతులెత్తేసింది. బ్యాట్‌తో మెరిసిన వాన్‌ బీక్‌ బంతితోనూ మాయ చేశాడు.

తొలి బంతిని ఛార్లెస్‌ సిక్సర్‌ బాదగా.. రెండో బంతికి హోప్‌ ఓ పరుగు తీశాడు. అయితే ఆ మరుసటి రెండు బంతుల్లో వాన్‌ బీక్‌.. ఛార్లెస్‌, హోల్డర్‌లను ఔట్‌ చేయడంతో విండీస్‌ కథ ముగిసింది. నెదర్లాండ్స్‌ సంచలన విజయం సాధించింది.

Videos

YSRCP మేయర్ అభ్యర్థుల జాబితా విడుదల

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

బూత్‌లలో సీసీ కెమెరాలు ఎందుకు లేవు? రిగ్గింగ్ కోసమేనా ఈ ప్లాన్?

మోదీ, అమిత్ షాకు CJP అభిజీత్ స్టాంగ్ వార్నింగ్

పవన్ కళ్యాణ్ చెప్పినా వినకండి ఈ ఎన్నికల్లో మంచివాళ్లను గెలిపించండి

నాతో కాలు దువ్వితే... JC బెదిరింపులకు కేతిరెడ్డి వార్నింగ్

మేయర్ మేమే.. కూటమిలో కుర్చీలాట

Photos

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)

+5

తిరుమల : ముత్యపుపందిరిపై సీతా స్వయంవరం అలంకారంలో శ్రీవారు (ఫొటోలు)