క్వాలిఫయర్స్‌ టీమ్‌ ఆఫ్‌ ది టోర్నీ ప్రకటన.. విండీస్‌ నుంచి ఒక్కరు కూడా లేరు

Published on Mon, 07/10/2023 - 15:26

క్రికెట్‌ వరల్డ్‌కప్‌ క్వాలిఫయర్స్‌ 2023 టీమ్‌ ఆఫ్‌ ది టోర్నీని ఐసీసీ కొద్ది సేపటి కి​ందట ప్రకటించింది. ఈ జట్టులో టోర్నీ విజేత శ్రీలంక నుంచి ముగ్గురు, రన్నరప్‌ నెదర్లాండ్స్‌ నుంచి ముగ్గురు, టోర్నీ ఆధ్యాంతం సూపర్‌గా రాణించిన జింబాబ్వే నుంచి ముగ్గురు, సంచలన విజయాలు నమోదు చేసిన స్కాట్లాండ్‌ నుంచి ఇద్దరు చొప్పున ప్లేయర్లను ఐసీసీ ఎంపిక చేసింది. 

ఈ జట్టులో టూ టైమ్‌ వరల్డ్‌ ఛాంపియన్స్‌ వెస్టిండీస్‌ నుంచి ఒక్కరికి కూడా చోటు లభించలేదు. సూపర్‌ సిక్స్‌ దశలో విండీస్‌ ఐదో స్థానానికి పరిమితం కావడంతో ఐసీసీ ఆ జట్టును పరిగణలోకి తీసుకోలేదు. బ్యాటింగ్‌లో నికోలస్‌ పూరన్‌ (7 మ్యాచ్‌ల్లో 350 పరుగులు, 2 సెంచరీలు), షాయ్‌ హోప్‌ (7 మ్యాచ్‌ల్లో 341 పరుగులు, సెంచరీ, 2 హాఫ్‌ సెంచరీలు) సత్తా చాటినా, వీరిని సైతం ఐసీసీ విస్మరించింది. 

ఓపెనర్లు పథుమ్‌ నిస్సంక (శ్రీలంక, 417 పరుగులు, 2 సెంచరీలు), విక్రమ్‌జీత్‌ సింగ్‌ (నెదర్లాండ్స్‌, 326, సెంచరీ)లను ఎంపిక చేసిన ఐసీసీ.. వన్‌డౌన్‌లో బ్రాండెన్‌ మెక్‌ముల్లెన్‌ (స్కాట్లాండ్‌, 364, 2 సెంచరీలు, 13 వికెట్లు), నాలుగో స్థానంలో క్వాలిఫయర్స్‌ టాప్‌ స్కోరర్‌ సీన్‌ విలియమ్స్‌ (జింబాబ్వే, 600, 3 సెంచరీలు), ఐదో స్థానంలో యువ ఆల్‌రౌండర్‌ బాస్‌ డి లీడ్‌ (నెదర్లాండ్స్‌, 285, సెంచరీ, 15 వికెట్లు), ఆరో ప్లేస్‌లో సికందర్‌ రజా (జింబాబ్వే, 325, సెంచరీ, 9 వికెట్లు), ఏడో స్థానంలో స్కాట్‌ ఎడ్వర్డ్స్‌ (నెదర్లాండ్స్‌, 314, 4 అర్ధసెంచరీలు), స్పెషలిస్ట్‌ స్పిన్నర్లుగా క్వాలిఫయర్స్‌ లీడింగ్‌ వికెట్‌ టేకర్లు హసరంగ (22 వికెట్లు), తీక్షణ (21) (శ్రీలంక), ఫాస్ట్‌ బౌలర్లుగా క్రిస్‌ సోల్‌ (స్కాట్లాండ్‌, 11 వికెట్లు), రిచర్డ్‌ నగరవ (జింబాబ్వే, 14 వికెట్లు)లను ఎంపిక చేసింది. ఈ జట్టుకు కెప్టెన్‌ కమ్‌ వికెట్‌కీపర్‌గా నెదర్లాండ్స్‌ కెప్టెన్‌ స్కాట్‌ ఎడ్వర్డ్స్‌ను ఎంపిక చేసింది. ​ 

Videos

YSRCP మేయర్ అభ్యర్థుల జాబితా విడుదల

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

బూత్‌లలో సీసీ కెమెరాలు ఎందుకు లేవు? రిగ్గింగ్ కోసమేనా ఈ ప్లాన్?

మోదీ, అమిత్ షాకు CJP అభిజీత్ స్టాంగ్ వార్నింగ్

పవన్ కళ్యాణ్ చెప్పినా వినకండి ఈ ఎన్నికల్లో మంచివాళ్లను గెలిపించండి

నాతో కాలు దువ్వితే... JC బెదిరింపులకు కేతిరెడ్డి వార్నింగ్

మేయర్ మేమే.. కూటమిలో కుర్చీలాట

Photos

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)

+5

తిరుమల : ముత్యపుపందిరిపై సీతా స్వయంవరం అలంకారంలో శ్రీవారు (ఫొటోలు)