Breaking News

పుజారా వందో టెస్టు.. కుటుంబం మొత్తం స్టేడియంలో

Published on Fri, 02/17/2023 - 15:58

ప్రస్తుతం ఒక ఆటగాడు సంప్రదాయ క్రికెట్‌(టెస్టు)లో వంద టెస్టుల మైలురాయిని అందుకున్నాడంటే సామాన్యమైన విషయం కాదు. టి20 క్రికెట్‌ లాంటి వేగవంతమైన ఆట వచ్చాకా ఎన్నో మార్పులు వచ్చాయి. ఫాస్ట్‌ క్రికెట్‌ ఆడేందుకు టెస్టు క్రికెట్‌కు దూరంగా ఉంటూ పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మాత్రమే కొనసాగుతున్నారు కొందరు క్రికెటర్లు.

ఇలాంటి టైంలో కేవలం టెస్టులకు మాత్రమే పరిమితమై స్పెషలిస్ట్‌గా ముద్రించుకున్న చతేశ్వర్‌ పుజారా టీమిండియా తరపున ఇవాళ వందో టెస్టు మ్యాచ్‌ ఆడుతున్నాడు. భారత్‌ క్రికెట్‌లో టెస్టు‍ల్లో వంద మ్యాచ్‌ల రికార్డును ఇంతకముందు 12 మంది మాత్రమే అందుకున్నాడు. తాజాగా పుజారా వంద టెస్టులాడిన 13వ క్రికెటర్‌గా అరుదైన జాబితాలో నిలిచాడు. బీసీసీఐతో పాటు టీమిండియా కూడా అతనికి గార్డ్‌ ఆఫ్‌ హానర్‌ ఇచ్చి గౌరవించుకుంది.

ఇక పుజారా వందో టెస్టు నేపథ్యంలో అతని ఆటను చూసేందుకు ఫ్యామిలీ మొత్తం ఢిల్లీలో వాలిపోయింది. దాదాపు 30 మంది కుటుంబసభ్యులు పుజారా వందో టెస్టు చూడడానికి వచ్చారు. కుటుంబం అంతా సౌత్‌ ఢిల్లీలోని ఒక హోటల్లో బస చేశారు. ఈ సందర్భంగా హోటల్‌ రిసెప్షన్‌లో పుజారా ఫ్యామిలీ గ్రూప్‌ ఫోటో దిగి సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. ఇక పుజారా వందో టెస్టు చూడడానికి  30 స్పెషల్‌ టీ-షర్ట్‌ తయారు చేసుకున్న ఫ్యామిలీ.. షర్ట్‌ వెనకాల చతేశ్వర్‌ పుజారా షార్ట్‌ఫామ్‌ (C, T) అక్షరాలు వచ్చేలా ప్రింట్‌ వేసుకున్నారు.

మ్యాచ్‌ జరుగుతున్న ఫిరోజ్‌ షా కోట్లా మైదానానికి కుటుంబం మొత్తం టీ-షర్ట్స్‌ వేసుకొని సందడి చేశారు. మా చింటు(పుజారా) వందో టెస్టు ఆడడం కళ్లారా చూడడం ఆనందంగా ఉందని కుటుంబసభ్యులు పేర్కొ‍న్నారు. వందో టెస్టులో పుజారా కచ్చితంగా సెంచరీ చేస్తాడని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. 

Videos

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)