Breaking News

టీమిండియాకు మరో పరాభవం

Published on Tue, 01/07/2025 - 14:52

ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీని 1-3 తేడాతో కోల్పోయిన టీమిండియాకు మరో పరాభవం ఎదురైంది. ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్ట్‌ ర్యాంకింగ్స్‌లో భారత్‌ మూడో స్థానానికి పడిపోయింది. చాలాకాలం తర్వాత టీమిండియా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టాప్‌-2 నుంచి బయటకు వచ్చింది. తాజాగా పాకిస్తాన్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0 తేడాతో క్లీన్‌ స్వీప్‌ చేసిన సౌతాఫ్రికా టీమిండియాను వెనక్కు నెట్టి రెండో స్థానానికి ఎగబాకింది. సౌతాఫ్రికా వరుసగా ఏడు టెస్ట్‌ మ్యాచ్‌ల్లో గెలిచి సెకెండ్‌ ప్లేస్‌కు చేరుకుంది. సౌతాఫ్రికా వరుసగా మూడు సిరీస్‌ల్లో 2-0 తేడాతో విజయాలు సాధించింది. 

మరోపక్క భారత్‌ గత ఎనిమిది మ్యాచ్‌ల్లో ఆరు పరాజయాలు మూటగట్టుకుంది. స్వదేశంలో న్యూజిలాండ్‌ చేతిలో 0-3 తేడాతో ఓడిన భారత్‌.. బీజీటీలో ఒక్క మ్యాచ్‌ గెలిచి, మూడు మ్యాచ్‌ల్లో దారుణ పరాజయాలను మూటగట్టుకుంది. స్వదేశంలో 12 ఏళ్ల తర్వాత స్వదేశంలో టెస్ట్‌ సిరీస్‌ (న్యూజిలాండ్‌ చేతిలో ఓటమి) కోల్పోయిన భారత్‌.. బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీని పదేళ్ల తర్వాత ఆసీస్‌కు వదిలేసింది. 

బీజీటీ ఓటమితో భారత్‌ డబ్ల్యూటీసీ ఫైనల్‌ రేసు నుంచి కూడా నిష్క్రమించింది. టీమిండియా తొలిసారి డబ్ల్యూటీసీ ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయింది. బీజీటీలో చివరి టెస్ట్‌ విజయంతో ఆస్ట్రేలియా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు అర్హత సాధించింది. పాక్‌పై తొలి టెస్ట్‌లో విజయంతోనే సౌతాఫ్రికా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు క్వాలిఫై అయ్యింది. జూన్‌ 11 నుంచి లార్డ్స్‌లో జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్లో సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు తలపడతాయి.

మరోవైపు బీజీటీలో భారత్‌ను చిత్తుగా ఓడించిన ఆస్ట్రేలియా రేటింగ్‌ పాయింట్లను గణనీయంగా పెంచుకుని అగ్రపీఠాన్ని (ఐసీసీ టెస్ట్‌ ర్యాంకింగ్స్‌లో) పటిష్టం చేసుకుంది. ప్రస్తుతం ఆసీస్‌ ఖాతాలో 126 రేటింగ్‌ పాయింట్లు ఉండగా.. రెండో స్థానంలో ఉన్న సౌతాఫ్రికా ఖాతాలో 112 రేటింగ్‌ పాయింట్లు ఉన్నాయి. 

మూడో స్థానానికి పడిపోయిన భారత్‌ 109 రేటింగ్‌ పాయింట్లు కలిగి ఉంది. 106 పాయింట్లతో ఇంగ్లండ్‌ నాలుగో స్థానంలో ఉండగా.. 96 పాయింట్లతో న్యూజిలాండ్‌ ఐదో ప్లేస్‌లో ఉంది. 87 పాయింట్లతో శ్రీలంక ఆరో స్థానంలో ఉండగా.. 83 పాయింట్లతో పాకిస్తాన్‌ ఏడో స్థానంలో నిలిచింది. వెస్టిండీస్‌ (75), బంగ్లాదేశ్‌ (65), ఐర్లాండ్‌ (26), జింబాబ్వే (4), ఆఫ్ఘనిస్తాన్‌ (0) వరుసగా ఎనిమిది నుంచి 12 స్థానాల్లో ఉన్నాయి.

ఇదిలా ఉంటే, రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా పాకిస్తాన్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో సౌతాఫ్రికా 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో కూడా గెలిచిన ప్రొటీస్‌ 2-0 తేడాతో పాక్‌ను క్లీన్‌ స్వీప్‌ చేసింది. రెండో టెస్ట్‌లో పాక్‌ నిర్దేశించిన 58 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని సౌతాఫ్రికా వికెట్‌ కోల్పోకుండా ఛేదించి జయకేతనం ఎగురవేసింది. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)