ఇంగ్లండ్‌ పర్యటనకు ముందు టీమిం‍డియాకు సంబంధించి కీలక అప్‌డేట్‌

Published on Thu, 06/05/2025 - 13:19

భారత టెస్ట్‌ జట్టు పూర్తి స్థాయి కెప్టెన్‌ హోదాలో శుభ్‌మన్‌ గిల్‌ తొలిసారి మీడియా ముందుకు రానున్నాడు. ఇవాళ (జూన్‌ 5) సాయంత్రం 7:30 గంటలకు ముంబైలోని బీసీసీఐ హెడ్‌ క్వార్టర్స్‌లో జరిగే ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ను హాజరు కానున్నాడు. ఈ సమావేశానికి గిల్‌తో పాటు టీమిండియా హెడ్‌ కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌ హాజరవుతాడు.

భారత జట్టు ఇంగ్లండ్‌ పర్యటన నేపథ్యంలో ఈ ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ జరుగనుంది. ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్ కోసం టీమిండియా త్వరలోనే లండన్‌కు బయల్దేరుతుంది. ఈ సమావేశంలో గిల్‌, గంభీర్‌ ఇంగ్లండ్‌లో అనుసరించబోయే వ్యూహాలు, తదుపరి డబ్ల్యూటీసీ సైకిల్‌లో ప్రణాళికల గురించి మీడియాకు వివరిస్తారు. 

దిగ్గజ ఆటగాళ్లు రోహిత్‌, విరాట్‌, అశ్విన్‌ టెస్ట్‌లకు రిటైర్మెంట్‌ ప్రకటించాక జరుగనున్న సిరీస్‌ కావడంతో ఇంగ్లండ్‌ టూర్‌కు ప్రాధాన్యత సంతరించుకుంది. గిల్‌ ఇటీవలే రోహిత్‌ శర్మ నుంచి భారత టెస్ట్‌ జట్టు పగ్గాలు చేపట్టాడు. బుమ్రా, పంత్‌ లాంటి సీనియర్లు ఉన్నా బీసీసీఐ గిల్‌కే టెస్ట్‌ కెప్టెన్సీ అప్పగించింది. 

గిల్‌ నేతృత్వంలో భారత టెస్ట్‌ క్రికెట్‌లో కొత్త శకం మొదలుకానుంది. ఇంగ్లండ్‌ పర్యటన కోసం ఎంపిక​ చేసిన జట్టులో యువకులు, అనుభవజ్ఞులు ఉన్నారు. వీరిని సమన్వయపరుచుకుంటూ గిల్‌ ఏ మేరకు నెట్టుకు రాగలడో చూడాలి. ఇంగ్లండ్‌ పర్యటనలో గిల్‌కు డిప్యూటీగా (వైస్‌ కెప్టెన్‌) రిషబ్‌ పంత్‌ను నియమించారు.

ఇంగ్లండ్‌ పర్యటనలో భారత్‌ జూన్‌ 20న తొలి టెస్ట్‌ ఆడనుంది. లీడ్స్‌ వేదికగా ఈ మ్యాచ్‌ జరుగనుంది. అనంతరం జులై 2, 10, 23, 31 తేదీల్లో రెండు, మూడు, నాలుగు, ఐదు టెస్ట్‌ మ్యాచ్‌లు బర్మింగ్హమ్‌, లార్డ్స్‌, మాంచెస్టర్‌, కెన్నింగ్‌స్టన్‌ ఓవల్‌ వేదికలుగా జరుగనున్నాయి. ఈ సిరీస్‌కు ముందు భారత్‌ జూన్‌ 13-16 మధ్యలో ఓ ఇంట్రా స్క్వాడ్‌ మ్యాచ​్‌ ఆడనుంది.

ఇంగ్లండ్‌ పర్యటన కోసం ఎంపికైన మెజార్టీ సభ్యులు ఇప్పటికే ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్నారు. భారత-ఏ జట్టులో భాగమైన వారు ఇంగ్లండ్‌ లయన్స్‌తో రెండు నాలుగు రోజుల అనధికారిక టెస్ట్‌ మ్యాచ్‌లు ఆడుతున్నారు. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌ ఇదివరకే ముగిసింది. రెండో మ్యాచ్‌ రేపటి నుంచి ప్రారంభం కానుంది.

ఇంగ్లండ్‌ పర్యటన కోసం భారత టెస్ట్‌ జట్టు: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్‌), రిషబ్ పంత్ (వైస్‌ కెప్టెన్‌), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీష్ రెడ్డి, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్ , వాషింగ్టన్ సుందర్, శార్దూల​ ఠాకూర్‌, జస్ప్రీత్‌ బుమ్రా, మొహమ్మద్‌ సిరాజ్‌, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాష్ దీప్, అర్షదీప్‌ సింగ్, కుల్దీప్ యాదవ్

 

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)