Breaking News

రెండో స్థానానికి ఎగబాకిన టీమిండియా

Published on Mon, 02/05/2024 - 17:13

ఐసీసీ వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ 2023-25 పాయింట్ల పట్టికలో టీమిండియా రెండో స్థానానికి ఎగబాకింది. వైజాగ్‌ టెస్ట్‌లో ఇంగ్లండ్‌పై విజయంతో డబ్ల్యూటీసీ ర్యాంకింగ్స్‌లో భారత్‌ పూర్వస్థితికి చేరింది. ఇంగ్లండ్‌తో తొలి టెస్ట్‌కు ముందు టీమిండియా రెండో స్థానంలోనే ఉండింది. అయితే ఆ మ్యాచ్‌లో ఓటమితో రోహిత్‌ సేన రెండో స్థానం నుంచి ఐదో ప్లేస్‌కు పడిపోయింది. తాజా విజయంతో భారత్‌ తిరిగి రెండో స్థానానికి ఎగబాకింది. 

పాయింట్ల పట్టికలో డిఫెండింగ్‌ డబ్ల్యూటీసీ ఛాంపియన్‌ ఆస్ట్రేలియా (55 శాతం విజయాలు) అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. భారత్‌ (52.77) , సౌతాఫ్రికా (50), న్యూజిలాండ్‌ (50), బంగ్లాదేశ్‌ (50), పాకిస్తాన్‌ (36.66), వెస్టిండీస్‌ (33.33), ఇంగ్లండ్‌ (25), శ్రీలంక వరుసగా రెండు నుంచి తొమ్మిది స్థానాల్లో నిలిచాయి. 

ఇదిలా ఉంటే, వైజాగ్‌ వేదికగా జరిగిన రెండో టెస్ట్‌లో టీమిండియా 106 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తుగా ఓడించింది. ఈ గెలుపుతో భారత్‌ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-1తో సమానంగా నిలిచింది. ఈ మ్యాచ్‌లో బుమ్రా (9/91), యశస్వి జైస్వాల్‌ (209), శుభ్‌మన్‌ గిల్‌ (104) అద్భుత ప్రదర్శనలతో టీమిండియాకు అపురూప విజయాన్ని అందించారు.

స్పిన్నర్లకు అనుకూలించే పిచ్‌పై తొమ్మిది వికెట్లు తీసి ఇంగ్లండ్‌ ఓటమికి ప్రధాన కారణమైన బుమ్రాకు ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించింది. హైదరాబాద్‌లో జరిగిన తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్‌ 28 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించిన విషయం తెలిసిందే. మూడో టెస్ట్‌ మ్యాచ్‌ రాజ్‌కోట్‌ వేదికగా ఫిబ్రవరి 15 నుంచి ప్రారంభమవుతుంది.  

రెండో టెస్ట్‌ స్కోర్‌ వివరాలు..

భారత్‌: 396 & 255
ఇంగ్లండ్‌: 253 & 292


 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)