చిరస్మరణీయ విజయం.. ఇంగ్లండ్‌ను వెనక్కు నెట్టిన టీమిండియా

Published on Tue, 08/05/2025 - 09:01

ఓవల్‌ టెస్ట్‌ విజయానంతరం వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ (2025-27) పాయింట్ల పట్టికలో భారత్‌ ఇం​గ్లండ్‌ను వెనక్కు నెట్టి మూడో స్థానానికి ఎగబాకింది. ఇంగ్లండ్‌ నాలుగో స్థానానికి పడిపోయింది. ఈ మ్యాచ్‌కు ముందు భారత్‌ నాలుగో స్థానంలో ఉండగా.. ఇంగ్లండ్‌ మూడో ప్లేస్‌లో ఉండింది.

ఈ మ్యాచ్‌‌ విజయానంతరం భారత్‌ విజయాల శాతం 46.67గా ఉండగా.. ఇంగ్లండ్‌ విన్నింగ్‌ పర్సంటేజ్‌ 43.33కు పడిపోయింది. ఆస్ట్రేలియా (100), శ్రీలంక (66.67) మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. 16.67 విజయాల శాతంతో బంగ్లాదేశ్‌ ఐదో ప్లేస్‌లో ఉంది. వెస్టిండీస్‌ ఈ సైకిల్‌లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఓడి ఆరో స్థానంలో ఉంది. న్యూజిలాండ్‌, పాకిస్తాన్‌, సౌతాఫ్రికా ఈ సైకిల్‌లో ఇంకా ఒక్క మ్యాచ్‌ కూడా ఆడలేదు.

కాగా, ఐదు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ కోసం ఇంగ్లండ్‌లో పర్యటించిన భారత జట్టు 2-2తో సిరీస్‌ను సమం చేసుకుంది. 1, 3 టెస్ట్‌ మ్యాచ్‌లు ఇంగ్లండ్‌ గెలువగా.. భారత్‌ 2, 5 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించింది. నాలుగో టెస్ట్‌ డ్రాగా ముగిసింది. 

డబ్ల్యూటీసీలో భారత్‌ తదుపరి టెస్ట్‌ సిరీస్‌ వెస్టిండీస్‌తో ఆడనుంది. రెండు మ్యాచ్‌ల ఈ సిరీస్‌ భారత్‌ వేదికగా ఆక్టోబర్‌ 2 నుంచి ప్రారంభమవుతుంది. తొలి టెస్ట్‌ అహ్మదాబాద్‌లో, రెండో టెస్ట్‌ (అక్టోబర్‌ 10 నుంచి) ఢిల్లీలో జరుగనున్నాయి.

ఇదిలా ఉంటే, హోరాహోరీగా సాగిన ఓవల్‌ టెస్ట్‌లో భారత్‌ 6 పరుగుల స్వల్ప తేడాతో ఇంగ్లండ్‌పై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌ చివరి రోజు భారత్‌ 35 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకుని చిరస్మరణీయ విజయం సాధించింది. భారత బౌలర్లలో సిరాజ్‌ మ్యాజిక్‌ చేసి ఇంగ్లండ్‌‌ చేతిలో ఉండిన 4 వికెట్లలో 3 వికెట్లు తీశాడు. ప్రసిద్ద్‌ కృష్ణ ఓ వికెట్‌ పడగొట్టాడు.

374 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్‌ ఓ దశలో పటిష్ట స్థితిలో (301/3) ఉన్నప్పటికీ.. భారత బౌలర్లు మ్యాచ్‌పై ఆశలు వదులుకోకుండా వీరోచితంగా పోరాడారు. ముఖ్యంగా సిరాజ్‌ ఓటమిని ఒప్పుకునే ప్రసక్తే లేదన్నట్లు ముందుకు సాగాడు. అతనికి ప్రసిద్ద్‌ సహకరించాడు. వీరిద్దరు కలిపి ఇంగ్లండ్‌ సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో 9 వికెట్లు తీశారు. సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు సహా మ్యాచ్‌ మొత్తంలో 9 వికెట్లు తీసిన సిరాజ్‌కు ప్లేయర్‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌ అవార్డు లభించింది.

 

 

 

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)