Breaking News

ఉత్కంఠ పోరులో టీమిండియా విజయం

Published on Tue, 01/03/2023 - 22:51

శ్రీలంకతో జరిగిన తొలి టి20లో టీమిండియా ఉత్కంఠ విజయాన్ని నమోదు చేసింది. 163 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 160 పరుగులకు ఆలౌటై విజయానికి రెండు పరుగుల దూరంలో ఆగిపోయింది. లంకకు చివరి ఓవర్‌లో 13 పరుగులు అవసరమైన దశలో కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా బంతిని అక్షర్‌ పటేల్‌ చేతికి ఇచ్చాడు.

పాండ్యా నమ్మకాన్ని వమ్ము చేయని అక్షర్‌ పటేల్ 20 ఓవర్లో 13 పరుగులకు గాను 11 పరుగులే ఇచ్చాడు. దీనికి తోడు చివరి రెండు బంతుల్లో రెండు వికెట్లు కోల్పోయింది. లంక బ్యాటర్లలో దాసున్‌ షనక 45 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. కుషాల్‌ మెండిస్‌ 28, చమిక కరుణరత్నే 23 పరుగులు చేశారు. టీమిండియా బౌలర్లలో శివమ్‌ మావి 4 వికెట్లు తీయగా..ఉమ్రాన్‌ మాలిక్‌, హర్షల్‌ పటేల్‌ చెరొక రెండు వికెట్లు తీశారు.

అంతకముందు తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. 94 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన దశలో దీపక్‌ హుడా(41 నాటౌట్‌),అక్షర్‌ పటేల్‌(31 నాటౌట్‌) టీమిండియా ఇన్నింగ్సను నిలబెట్టారు. ఓపెనర్‌ ఇషాన్‌ కిషన్‌ 37 పరుగులు చేసి ఔటయ్యాడు. లంక బౌలర్లలో హసరంగా, దనుంజయ డిసిల్వా, దిల్షాన్‌ మధుషనక, కరుణరత్నే, తీక్షణలు తలా ఒక వికెట్‌ తీశారు. ఈ విజయంతో టీమిండియా మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఇరుజట్ల మధ్య రెండో టి20 జనవరి 5(గురువారం) పుణే వేదికగా జరగనుంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)