క్రికెట్‌ అభిమానులకు శుభవార్త

Published on Sun, 02/08/2026 - 16:04

క్రికెట్‌ అభిమానులకు శుభవార్త. టీ20 ప్రపంచకప్‌లో భారత్‌-పాకిస్తాన్‌ గ్రూప్‌ స్టేజీ మ్యాచ్‌పై అనిశ్చితి తొలిగిపోయేలా ఉంది. తొలుత పాక్‌ ప్రభుత్వం ఈ మ్యాచ్‌ను బాయ్‌కాట్‌ చేసున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఐసీసీ జోక్యంతో పాక్‌ క్రికెట్‌ బోర్డు ఈ మ్యాచ్‌ ఆడేందుకు అంగీకరించినట్లు సమాచారం. ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు ఐసీసీ ప్రతినిధులు  ఇమ్రాన్ ఖవాజా, ముబషిర్ ఉస్మానీ పీసీబీ అధ్యక్షుడు మొహిసిన్‌ నఖ్వీతో లాహోర్‌లో చర్చలు జరిపారు. ఈ చర్చల తర్వాత పీసీబీ కొన్ని షరతులపై భారత్‌తో మ్యాచ్‌ ఆడేందుకు అంగీకరించినట్లు సమాచారం​.

కాగా, గత కొద్ది రోజులుగా భారత్‌-పాక్‌ ప్రపంచకప్‌ గ్రూప్‌ స్టేజీ మ్యాచ్‌పై నీలినీడలు కమ్ముకున్న విషయం తెలిసిందే. ప్రపంచకప్‌ నుంచి బంగ్లాదేశ్‌ బహిష్కరణకు నిరసనగా పాక్‌ ప్రభుత్వం భారత్‌తో గ్రూప్‌ స్టేజీ మ్యాచ్‌ ఆడకూడదని నిర్ణయించుకుంది. ఈ మ్యాచ్‌ రద్దైతే ఐసీసీ సహా ప్రపంచకప్‌ బ్రాడ్‌కాస్టర్లు తీవ్రంగా నష్టపోయేవారు. ఇ​ందుకు ప్రతిగా ఐసీసీ పీసీబీపై కఠిన చర్యలు తీసుకునేందుకు అవకాశాలు ఉండేవి. చివరికి ఐసీసీ ప్రతినిధుల మధ్యవర్తిత్వంతో ఈ సమస్యకు పరిష్కారం లభించినట్లు తెలుస్తుంది. భారత్‌-పాక్‌ మ్యాచ్‌ ఫిబ్రవరి 15న కొలొంబో వేదికగా జరగాల్సి ఉంది.

ఇదిలా ఉంటే, ప్రపంచకప్‌లో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో భారత్‌, పాక్‌, వెస్టిండీస్‌, న్యూజిలాండ్‌ తలో మ్యాచ్‌ గెలిచాయి. భారత్‌ యూఎస్‌ఏపై, పాక్‌ నెదర్లాండ్స్‌పై, వెస్టిండీస్‌ స్కాట్లాండ్‌పై, న్యూజిలాండ్‌ ఆఫ్ఘనిస్తాన్‌పై విజయాలు సాధించాయి. 

Videos

ఫ్లెక్సీని చూసి తన తల్లి అనుకొని.. పాల కోసం ఆకలితో లేగదూడ తంటాలు

నువ్వు జోక్యం చేసుకుంటే.. నీ హోంమినిస్టర్ పోస్ట్ ఊడిపోతుంది..!

సాక్షి టీవీ సోషల్ మీడియా అకౌంట్లను బ్లాక్ చేయించిన కూటమి సర్కార్

దగ్గుపాటి ప్రసాద్ కు గంగారాం షాక్!

బస్సును ముద్దాడిండు డ్రైవరన్న

ప్రియుడితో కలిసి భర్తను చంపేందుకు భార్య కుట్ర

అవి వాళ్ళు రాస్తే వచ్చే మార్కులు కాదు.. SGT ప్రభాకర్ కు ఉద్యోగం ఎలా ఇచ్చారంటే

ఇంకెన్నాళ్లు నీ కొడుకును కాపాడుకుంటావ్.. వైఎస్ జగన్ సెన్సేషనల్ కామెంట్స్

ఒక రోజుకు 80 లక్షలు... ఎవడబ్బ సొమ్మని ఖర్చు పెడుతున్నారు..!

చైనా వేదికపై ఫేక్ మేయర్ ప్రచారం?

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)