Breaking News

జాక్‌పాట్‌ కొట్టేసిన సిరాజ్

Published on Sat, 02/07/2026 - 07:28

అనుకున్నదే జరిగింది. టీ20 వరల్డ్‌కప్‌ జట్టులోకి హైదరాబాదీ పేసర్‌ మొహమ్మద్‌ సిరాజ్‌ అనూహ్యంగా ఎంట్రీ ఇచ్చాడు. సౌతాఫ్రికాతో వార్మప్‌ మ్యాచ్‌ సందర్భంగా గాయపడిన హర్షిత్‌ రాణా స్థానాన్ని భర్తీ చేస్తూ, ఆఖరి నిమిషంలో జట్టులోకి వచ్చాడు. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. 

సిరాజ్‌ చేరిక టీమిండియా బౌలింగ్‌ బలాన్ని మరింత పెంచనున్నప్పటికీ.. ఆల్‌రౌండర్‌ హర్షిత్‌ రాణా జట్టుకు దూరం​ కావడం ఒకింత మైనస్సే అవుతుంది. ఎందుకంటే.. హర్షిత్‌ లోయర్‌ ఆర్డర్‌లో మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడగల సమర్దుడు. ఛేదనల్లో అతని ఇన్నింగ్స్‌లు చాలా కీలకమవుతాయి. 

బౌలింగ్‌ విషయంలోనూ హర్షిత్‌ ఇటీవలకాలంలో మంచి మార్కులే కొట్టేశాడు. టీ20 జట్టుకు హర్షిత్‌ లాంటి ఆల్‌రౌండర్‌ చాలా కీలకం. మరోవైపు సిరాజ్‌ చేరిక కూడా తీసిపారేయడానికి వీల్లేదు. ఎందుకంటే అతను ఆల్రెడీ ప్రూవెన్‌ బౌలర్‌. పైగా మంచి ఫామ్‌లో ఉ‍న్నాడు. 

గత వరల్డ్‌కప్‌ విన్నింగ్‌ జట్టులోనూ కీలకంగా వ్యవహరించాడు. హర్షిత్‌లా బ్యాటింగ్‌ చేయలేడన్నది తప్పిస్తే, సిరాజ్‌ లాంటి బౌలర్‌ జట్టుకు ఎప్పుడూ అదనపు బలమే. సిరాజ్‌ భారత్‌ తరఫున తన చివరి టీ20ని 2024 జులైలో శ్రీలంకతో ఆడాడు. సిరాజ్‌.. బుమ్రా, అర్షదీప్‌తో కలిసి కొత్త బంతిని షేర్‌ చేసుకుంటాడు. ఈ త్రయం మరోసారి భారత్‌కు ప్రపంచకప్‌ అందించాలని ఆశిద్దాం.

సుందర్‌ విషయంలో ఇంకా క్లారిటీ లేదు
గాయపడిన హర్షిత్ రాణా స్థానాన్ని సిరాజ్‌తో భర్తీ చేసిన బీసీసీఐ.. మరో ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌కు ప్రత్యామ్నాయాన్ని మాత్రం ఇంకా ప్రకటించలేదు. ప్రపంచకప్‌ జట్టులో ఉన్న సుందర్‌ చాలా రోజులుగా బీసీసీఐ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌లో రిహాబ్‌లో ఉన్నాడు. 

సుందర్‌ గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదు. బీసీసీఐ సుందర్‌ విషయంలో  ఇంకా వేచి చూడాలని భావిస్తుంది. కాబట్టే ఇంకా అతనికి ప్రత్యామ్నాయాన్ని ప్రకటించలేదు. ప్రపంచకప్‌ తదుపరి దశ సమయానికంతా సుందర్‌ కోలుకుంటాడని ఆశిద్దాం.

ఇదిలా ఉంటే, భారత్‌ ఇవాళ (ఫిబ్రవరి 7) ప్రపంచకప్‌లో తమ తొలి మ్యాచ్‌ ఆడనుంది. ఈ మ్యాచ్‌ ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా రాత్రి 7 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌ తుది జట్టులో సిరాజ్‌కు తప్పక అవకాశం దొరుకుతుంది.

టీ20 ప్రపంచకప్‌కు అప్‌డేటెడ్‌ భారత జట్టు: సూర్యకుమార్‌ యాదవ్ (సి), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (డబ్ల్యుకె), ఇషాన్ కిషన్ (డబ్ల్యుకె), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్ (విసి), రింకు సింగ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, వరుణ్‌ చక్రవర్తి, వాషింగ్టన్‌ సుందర్‌, మొహమ్మద్‌ సిరాజ్‌

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

కృష్ణాష్టమి సెలబ్రేషన్.. కిరణ్ అబ్బవరం కొడుకు ఇలా (ఫొటోలు

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)