Breaking News

T20 World Cup 2024: రేపు (జూన్‌ 1) బంగ్లాదేశ్‌తో తలపడనున్న భారత్‌

Published on Fri, 05/31/2024 - 13:39

టీ20 వరల్డ్‌కప్‌ 2024లో టీమిండియా రేపు (జూన్‌ 1) తొలి మ్యాచ్‌ ఆడనుంది. ఈ మ్యాచ్‌ వార్మప్‌ మ్యాచే అయినప్పటికీ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్‌లో టీమిండియా బంగ్లాదేశ్‌తో తలపడనుంది. న్యూయార్క్‌లో కొత్తగా నిర్మించిన స్టేడియంలో జరుగబోతున్న తొలి మ్యాచ్‌ కావడంతో ఈ మ్యాచ్‌పై ఆసక్తి నెలకొంది. ఇదే మైదానంలో టీమిండియా జూన్‌ 9న పాకిస్తాన్‌తో తలపడనుంది. 

దాయాదితో ఆడబోయే మ్యాచ్‌ కూడా ఇదే మైదానంలో జరుగనుండటంతో ఫ్యాన్స్‌లో ఆసక్తి మరింత ఎక్కువగా ఉంది. భారతకాలమానం ప్రకారం బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌ రాత్రి 8 గంటలకు ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్‌ ప్రత్యక్ష ప్రసారం లేనప్పటికీ.. ఆన్‌లైన్‌లో స్కోర్‌ అప్‌డేట్స్‌ అందుబాటులో ఉంటాయి. టీమిండియా తరఫున కోహ్లి మినహా మిగతా జట్టంతా అందుబాటులో ఉంది. కోహ్లి నిన్ననే ముంబై నుంచి న్యూయార్క్‌కు బయల్దేరాడు. ప్రయాణ బడలికల కారణంగా రేపటి మ్యాచ్‌కు కోహ్లి అందుబాటులో ఉండే అవకాశాలు తక్కువ.

కాగా, ప్రపంచకప్‌ రెగ్యులర్‌ మ్యాచ్‌లు సైతం రేపటి నుంచే ప్రారంభంకానున్నాయి. ఆతిథ్య యూఎస్‌ఏ-కెనడా మధ్య మ్యాచ్‌తో పోట్టి ప్రపంచకప్‌ 2024 ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్‌ భారతకాలమానం ప్రకారం జూన్‌ 2వ తేదీ ఉదయం 6 గంటలకు మొదలవుతుంది. డల్లాస్‌లో కొత్తగా నిర్మించిన స్టేడియంలో ఈ మ్యాచ్‌ జరుగనుంది. ఈ వేదికపై ఇదివరకు పలు ప్రాక్టీస్‌ మ్యాచ్‌లు జరిగాయి. యూఎస్‌ఏ-కెనడా మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉంది. డల్లాస్‌లో జరగాల్సిన గత మూడు మ్యాచ్‌లు వర్షం కారణంగా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి.

ఇదిలా ఉంటే, ప్రపంచకప్‌లో భారత్‌ ప్రస్తానం జూన్‌ 5న ఐర్లాండ్‌తో జరుబోయే మ్యాచ్‌తో మొదలవుతుంది. జూన్‌ 9న టీమిండియా.. దాయాది పాకిస్తాన్‌తో తలపడనుంది. గ్రూప్‌ దశలో భారత్‌.. పాక్‌, ఐర్లాండ్‌లతో పాటు యూఎస్‌ఏ, కెనడా జట్లతో తలపడుతుంది.

 

 

Videos

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)